Sunday, September 8, 2024
spot_img

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్

తప్పక చదవండి
  • బకాయిలు (5500 కోట్లు) వెంటనే విడుదల చేయాలి..
  • పీ.డీ.ఎస్.యూ. రాష్ట్ర కార్యవర్గం డిమాండ్..

హైదరాబాద్ : గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ బకాయిలు 5500 కోట్లు, వెంటనే విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కోసం ఎదురు చూస్తున్నారు.. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గత రెండు విద్యా సంవత్సరం కాలం నాటి బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని, అటు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం మాత్రo మీరు మొత్తం ఫీజు చెల్లించి మాత్రమే సర్టిఫికెట్ తీసుకెళ్లాలని చెప్పడం తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
అప్లికేషన్ ను సకాలంలో అందజేసిన వాటికి కూడా నిధులు మంజూరు చేయటం లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ట్రెజరీ డిపార్ట్మెంట్లో నిధుల కోసం టోకెన్స్ కేటాయించి డబ్బులు విడుదల చేయకుండా కాలయాపన చేసి ఇప్పుడు నిధులు లేవు అని నిర్లక్ష్య సమాధానివ్వటం, సరియైన పద్దతి కాదని, వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తిగా ఫిజు బకాయిలను విడుదల చేయాలని పీ.డీ.ఎస్.యూ.గా డిమాండ్ చేస్తున్నాం.. లేనియెడల పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం.. .ఆదివారం రోజు విద్యానగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతకాని రాకేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. సాంభ, రాష్ట్ర కోశాధికారి ఎం.వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు కే. గణేష్,జి. నర్సింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు