Sunday, September 8, 2024
spot_img

తెలంగాణ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ

తప్పక చదవండి
  • తెలంగాణలో ఈసారి పోటీ చేయాల్సిందేనన్న నేతలు
  • పోటీ చేయకపోతే చేతులారా పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నట్టేనని స్పష్టీకరణ
  • క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకోగలనన్న పవన్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనతో పాటు ప్రచారాన్నిసైతం ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలోని జనసేన నేతలు పలు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో పార్టీ తెలంగాణ నేతలు నిన్న కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2018 ఎన్నికల్లో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న తమ అభిప్రాయాన్ని గౌరవించి పోటీకి పట్టుబట్టలేదని… బీజేపీ విన్నపం మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నామని చెప్పారు.

ఈ సారి మాత్రం పోటీ చేయాల్సిందేనని విన్నవించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని… ఈసారి పోటీ చేయకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేతులారా అడ్డుకున్నట్టు అవుతుందని చెప్పారు. క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని, భవిష్యత్తులో బలంగా వెళ్లడం కష్టమవుతుందని అన్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందిస్తూ… క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తాను కూడా అర్థం చేసుకోగలనని చెప్పారు. తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమని.. అయితే జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటి, రెండు రోజుల సమయం అవసరమని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు