Sunday, September 8, 2024
spot_img

శ్రోతల జీవితాలలో భాగాలు…

తప్పక చదవండి
  • బావగారి కబుర్లు
  • సెప్టెంబర్ 11… ప్రయాగ నరసింహ శాస్త్రి వర్ధంతి
    హైదరాబాద్ : ఆకాశవాణి శ్రోతలకు చిర పరిచితులు ప్రయాగ నరసింహ శాస్త్రి. రేడియోనే ప్రధాన మనో రంజక సాధనంగా ఒకనాటి ప్రజల నిత్య జీవితాలతో పెనవేసుకున్న రోజులలో ప్రయాగ నిత్య విధి కార్యక్ర మాలు శ్రోతల జీవిత భాగస్వాములు అయినా యంటే అతిశయోక్తి కాదేమో. ఆకాశ వాణి ప్రయోక్తగా, తెలుగు సినీ నటునిగా, హరికథకులుగా, రచయితగా, గాయకునిగా ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 20, 1909 – సెప్టెంబరు 11, 1983) తెలుగు ప్రజలకు రేడియో ద్వారా చిర పరిచితులు.

తన ప్రత్యేక కంఠ స్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని ఉర్రూత లూగించిన వ్యక్తి శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ప్రశంసా పాత్రుడైన వ్యక్తి. 1936 లో ప్రయాగ ఆకాశవాణి మదరాసు కేంద్రంలో నిలయ విద్వాంసు డుగా చేరారు. ‘ బావగారి కబుర్ల ద్వారా ఆయన శ్రోతలకి చేరువయ్యారు. ఆయన, గాడేపల్లి సూర్య నారాయణతో కలిసి బావగారి కబుర్లు నిర్వహించే వారు. అవి శ్రోతల జీవనంలో భాగమై పోయాయి. “ఏమండోయ్ బావగారు రావాలి రావాలి” అనే పలకరింపులు సహజమ య్యాయి. స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు ప్రయాగ.

నరసింహశాస్త్రి 1909 నవంబర్ 20 న విశాఖపట్నం జిల్లా పెదగాడి గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండి సంగీత సాహిత్యాలపై అపారమైన ప్రీతి. విజయనగరం మహారాజా కళాశాలలో చదువు కొని పట్ట భద్రులయ్యారు. శ్రీశ్రీ, ఇంద్రగంటి హనుమఛ్చాస్త్రి ఆయన సహా ధ్యాయులు. హరికథా పితామ హుడు ఆదిభట్ల నారాయణ దాసు వద్ద హరికథా గానంలో మెళుకువలు నేర్చు కొన్నారు. చక్కని గాత్రము రూపము ఉన్న ప్రయాగ 1935లో చలన చిత్రరంగ ప్రవేశం చేశారు. భీష్మ చిత్రంలో విచిత్ర వీర్యుని పాత్రను పోషించారు. నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో గణపతి పాత్రను పోషించారు. అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. 1969లో ఆకాశ వాణిలో పదవీ విరమణ చేసిన తర్వాత మళ్లీ నటన పై ఆసక్తి తో చిత్రరంగంలో ప్రవేశించారు. చీకటి వెలుగులు, అందాల రాముడు, డబ్బుకు లోకం దాసోహం వంటి సినిమాలలో నటించారు.

- Advertisement -

ఆకాశవాణి మదరాసు కేంద్రంలో 1936 నుండి రెండు దశాబ్దాలు పని చేశారు. అక్కడ వీరు ప్రసారం చేసిన మొద్దబ్బాయ్ హెచ్.ఎం.వి. గ్రామఫోన్ రికార్డు కంపెని వారు రికార్డు చేసి విడుదల చేశారు. 20కి పైగా హెచ్.ఎం.వి. రికార్డులు ఆయన విడుదల చేశారు. శ్రోతలలో వీరికంత ప్రశస్తి వుండేది. 1956లో ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి బదలీ అయ్యారు. అక్కడ పింగళి లక్ష్మీకాంతం, బందా కనక లింగేశ్వర రావు, బాలాంత్రపు రజనీ కాంత రావు, జరుక్ శాస్త్రి, బాల మురళి, ఓలేటి వంటి పండితుల సాహచర్యం లభించింది.

విజయవాడలో ప్రయాగ గ్రామీణ కార్యక్రమాల ప్రయోక్తగా పనిచేశారు. ఎన్నో జానపద గేయాలను పాడి, పాడించి శ్రోతల మన్ననలందు కొన్నారు. హరికథలు స్వయంగా రచించి గానం చేశారు. త్యాగరాజ చరిత్ర, కన్యాకుమారి, గాంధీజీ, శంకర విజయం హరి కథలు ప్రముఖాలు. 1962లో భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో గాంధీజీ బుర్రకథను వినిపించి బంగారు పతకంతో సన్మానించ బడ్డారు. ఆయన వివిధ బుర్రకథలు హెచ్.ఎం.వి. గ్రామఫోను రికార్డులుగా విడుదలైనాయి.

వినోదాల వీరయ్యగా విజయ వాడ కేంద్రం నుండి ఎన్నో కార్యక్రమాలు సమర్పించారు. ఆకాశవాణిని ప్రయాగకు ఆరోప్రాణంగా భావించే వారు. 1969లో పదవీ విరమణ చేసేంత వరకు ఆయన ప్రయోక్తగా ఎన్నో కార్యక్రమాలు వెలువడ్డాయి. 1970 నుండి ఐదు సంవత్సరాలు కేంద్ర సంగీత నాటక అకాడమీ పక్షాన ‘ బాలాజీ ఆర్ట్ థియేటర్ ‘ పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేశారు. 1980 నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంగీత కళా పీఠంలో యక్షగానాలు, హరికథల అధ్యాపకులుగా పని చేశారు. హిందు ధర్మ ప్రచార పరిషత్ లో జానపద కళా ప్రచారకులుగా వ్యవహరించారు.

1983 సెప్టెంబరు 11న పరమ పదించారు. మాట, పాట, ఆటలతో శ్రోతల్ని సంబరపెట్టిన ప్రయాగ నిత్యోత్సాహి. ప్రయాగ నరసింహ శాస్త్రి కుమార్తె వేదవతి ఆకాశవాణిలో నిజామాబాద్ లో అసిస్టెంట్ స్టేషను డైరక్టరుగా సుపరిచితులు.

భీష్మ – విచిత్ర వీర్యుడు,
త్యాగయ్య – గణపతి, చీకటి వెలుగులు, అందాల రాముడు, డబ్బుకు లోకం దాసోహం తదితర చిత్రాలలో ఆయన నటించారు.

  • రామ కిష్టయ్య సంగన భట్ల…
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు