Sunday, September 8, 2024
spot_img

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించరా..?

తప్పక చదవండి
  • కార్మికులకు మద్దతుగా ధర్నాకు సిద్ధమౌతున్న బీఎస్పీ నాయకులు..!
    వికారాబాద్‌ : ఏళ్ల తరబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ స్యలు పరిష్కరిం చడంలో చొరవ చూపాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది. పంచాయతీ కార్మికులు సంవత్స రాలు తరబడి పనిచేస్తున్నా రెగ్యులర్‌ చేయడం లేదు, కనీస వేతనాలు పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కూడా అమలు చేయడం లేదని పంచాయతీ కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కోవిడ్‌ సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేసారు. కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చి కూడా అమలు చేయడం లేదు. ఆ యొక్క హామీని నిలబెట్టుకోవాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా పెంచి ఇవ్వాలి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఎప్పటికైనా దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలనీ వికారాబాద్‌ జిల్లాలోని బీఎస్పీ నాయకులు నిరసనకు దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.జీవో 60ని వర్తింపజేస్తూ పారిశుద్ధ్య కార్మికులకు రూ.15,600, కారోబార్‌ , బిల్‌ కలెక్టర్లు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, వీధి దీపాల నిర్వహణ, వాటర్‌ సప్లెట్క కార్మికులకు రూ.19,500, కంప్యూటర్‌ ఆపరేటర్లు, టెక్నికల్‌ విభాగంలో పనిచేసే సిబ్బందికి రూ.22,750 వేతనం చెల్లించాలనీ ప్రతి పక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. యాక్ట్‌ 2/94ను రద్దుచేసి పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో బీఎస్పీ పార్టీ తరపున ధర్నా చేపట్టడం జరుగుతుందనీ చెప్పకనే చెబుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు