Sunday, September 8, 2024
spot_img

తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు అధికారిక ఘన స్వాగతం

తప్పక చదవండి
  • అధికారులు,నాయకులతో కలిసి అమరుల స్తూపానికి నివాళులు..
  • లయన్స్‌ క్లబ్‌, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులకు పరికరాల పంపిణీ..

వికారాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర స్వీకర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత వికారాబాద్‌ కు గడ్డం ప్రసాద్‌ కుమార్‌ రావడంతో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుకు వికారాబాద్‌ ఆర్‌ అండ్‌అతిథి గృహాంలోకి రాగానే జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి జిల్లా అధికారులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించగా స్వీకరించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు మారు ఆర్డీవో విజయకుమారి, డీఎస్పీ నర్సిములుతో పాటు మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల, మునిసిపల్‌ ప్లోర్‌ లీడర్‌ సుధాకర్‌ రెడ్డి నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామిదేవాలయ అర్చకులు ప్రసాద్‌ కుమార్ను వేద మంత్రాలతో ఆశీర్వదించి జ్ఞాపికను అందజేశారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న అమరుల స్తూపం వద్దకు చేరుకుని అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి సంతోష్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ విశ్వనాథం సత్యనారాయణ, రాంచందర్‌ రెడ్డి, హన్మంతిరెడ్డి, మహిపాలెరెడ్డి, వెంకటరెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.సమాజంలో లయన్స్‌ క్లబ్‌ సేవలు ప్రశంసనీయంస్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సమాజంలో లయన్స్‌ గత కొన్ని దశాబ్దాలంగా గొప్ప సేవ కార్యక్రమాలను అందిస్తుందని రాష్ట్ర స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం వికారాబాద్‌ పట్టణంలోని క్లబ్‌ ఫంక్షన్‌ హాల్‌ లయన్స్‌ క్లబ్‌, తెలంగా ణ అమెరికా తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహించిన దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లయన్స్‌ క్లబ్‌ మున్ముందు ఇలాంటి సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆవసరమైతే తనవంతు సహకారం లయన్స్‌ క్లబ్‌ అందిస్తానని తెలిపారు. వికారాబాద్‌ ప్రాంతంలో ఈ మధ్య క్యానర్స్‌ వస్తుందని పేపర్లలో చూడడం జరిగిందని అందు కోసం లయన్స్‌ క్లబ్‌ మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు. అందు కోసం తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు విజయ్వత్‌, ప్రధాన కార్యదర్శి కబిత, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు లవకుమార్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు