Sunday, September 8, 2024
spot_img

పర్మిట్‌ రూమ్‌ కాదది, ప్రయాణ ప్రాంగణం

తప్పక చదవండి
  • ఫ్రీ బస్సు సర్వీసు భేష్‌..బస్టాండ్‌ బేకార్‌..
  • ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన భక్తుల రద్దీ..
  • ప్రయాణ ప్రాంగణంలో మౌలిక వసతులు కరువు..
  • మందుబాబులకు అడ్డాగా పల్లెవెలుగు నిలయాలు..
  • పుణ్యక్షేత్రాల పరిధిలో పనికిరాని ప్రయాణ ప్రాంగణాలు..
  • శ్రీచాముండేశ్వరి ఆలయ సమీపంలో పాడుపడిన బస్సు స్టాండ్‌..

చిలిపిచేడ్‌ : కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిరాగానే ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి తీసుకొచ్చి సంబరాలు చేసుకోవాలని పిలుపునిస్తే మందు బాబులు యధేచ్ఛగా సంబరాలు జరుపుకుంటూ ఏకంగా బస్‌ షెల్టర్లు, బస్‌ స్టాండ్లు,ప్రయాణ ప్రాంగణాలను తమ అడ్డాగా మార్చుకుం టున్నారు. అందుకు నిదర్శనమే చిలిపిచేడ్‌ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చాముండేశ్వరి ఆలయం సమీపంలో గల పనికిరాని ప్రయాణ ప్రాంగణాలే అంటున్నారు స్థానికులు.

మండలంలో పాడుబడిన ప్రయాణ ప్రాంగణాలు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికి.. చిలిపిచేడ్‌ మండల పరిధిలో చాలా వరకు ప్రయాణ ప్రాంగణాలు పాడుబడి ఉన్నాయి. వినియోగానికి నోచుకోని కనీస మౌలిక వసతులు లేకుండా ఉండటంతో అవి అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. మందుబాబులకు పర్మిట్‌ రూములుగా వెలుస్తున్నాయి. ఇంతకాలం ఆటోలు,ప్రైవేట్‌ వాహనాలపై వెళ్లే దినసరి కూలీ మహిళలు,ఉద్యోగినులు, విద్యార్ధినిలు ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో బస్సు కోసం బస్‌ షెల్టర్‌ కు వస్తే నిలబడే స్థితిలేదంటున్నారు.గతంలో ఉన్న బస్సు సర్వీసులను కరోనా మహమ్మారి సమయంలో కుదించిన ఆర్టీసీ సంస్థ అరకొరగా నడుపుతున్న సర్వీసులలో ప్రస్తుతం ఉచిత ప్రయాణం వలన పుణ్యక్షేత్రా లకు మహిళల రద్దీ కొనసాగుతోంది.ఈ క్రమంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే భక్తులకు కొంగుబంగారమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలో ప్రయాణ ప్రాంగాణాలు పునరుద్దరించక పోవడంతో అవి పాడుపడిన కొంపలుగా దర్శనమిస్తున్నాయి.దీంతో మహిళలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని,సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు ప్రయాణ ప్రాంగణంలో నిలువనీడ లేకుండా ఉన్నాయని వాపోతున్నారు.

- Advertisement -

బస్సు స్టాండ్‌ లే మందు బాబులకు అడ్డా..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సమీపంలో మందుబాబుల ఆడగాలకు అంతులేకుండా పోయింది. అనునిత్యం వాహనాలు తిరిగే ప్రదేశాల్లో కూడా మద్యం సేవిస్తూ మందుబాబులు చిందులు వేస్తున్నారు.మద్యం సేవిస్తూ చిందులేసే వారిని అధికారులు నియత్రించ లేకపోతున్నారు. పుణ్యక్షేత్రాలను భ్రష్టు పట్టించడమే పనిగా పెట్టుకున్నట్లుగా పాతబడిన ప్రయాణ ప్రాంగణాలనే పర్మిట్‌ రూములుగా మార్చుకొని సంబరాలు జరుపుకుంటున్నారు.అందుకు నిదర్శనమే మెదక్‌ నుండి జోగిపేట వెళ్లే దారిలో ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయం సమీపంలో ఉన్న పాడుబడిన ప్రయాణ ప్రాంగణంలో మందుబాబులు మద్యం సేవించిన సీసాలు దర్శనమివ్వడమే. ఎల్లపుడూ ప్రయాణికులు ప్రయాణించే ఈ రహదారిపై రాత్రివేళలో మద్యం సేవించడం ఏంటని ఆలయానికి వచ్చే భక్తులు ఆశ్చర్యపోతున్నారు.మద్యం సేవించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు