Sunday, September 8, 2024
spot_img

ఆగని అక్రమ నిర్మాణాలు..

తప్పక చదవండి
  • పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు
  • అనుమతులు లేకుండా అదనపు అంతస్థులు
  • ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌.. నిద్రమత్తులో అధికారులు
    సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధి లోని లోని అయిదు డివిజన్‌ లలో అక్ర మ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రోడ్లను కబ్జా చేసి సెట్‌ బ్యాక్‌ లు లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. జి ప్లస్‌ 2 అనుమతి తీసుకొని నాలుగు, అయిదు బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడంటం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను నిర్మిస్తే చర్యలు తీసుకోవాలని సూచించినా అధికారులు మాత్రం నిద్రమత్తు వదలడం లేదు. సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. సర్కిల్‌ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి. కార్యాలయాల కుర్చీలకే పరిమితం అవుతున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు అక్రమంగా నిర్మిస్తున్న గృహ యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమ కట్టడాల గురించి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాలనీ వాసులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఫిర్యాదు చేసినా నామమాత్రపు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. సీతాఫల్‌ మండి లోని డివిజన్‌ లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెనుక వీధిలో రవీంద్ర నగర్‌ లో జి ప్లస్‌ 2 అనుమతి తీసుకొని జి ప్లస్‌ 3 ఆపై పెంట్‌ హౌస్‌ నిర్మాణం, చిలకలగూడ పార్క్‌ ఎదురుగా నిర్మిస్తున్న నాలుగు అంతస్థుల అక్రమ నిర్మాణం, సీతాఫల్‌ మండి నుంచి వారసిగూడా వెళ్లే ప్రధాన రహదారిలో లక్కీ హోటల్‌ దగ్గర అక్రమ సెల్లర్‌ తో పాటు అక్రమ అంతస్థుల నిర్మాణం కానీ ఇలా పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు అధికారుల దృష్టికి వెళ్లిన కూడా ఆ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అయ్యారు. సికింద్రాబాద్‌ సర్కిల్‌ నూతనంగా వచ్చిన ఏసీపీ అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటారో లేదా అందరి అధికారుల లాగా చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేస్తారో చూడాలి. కాసులకు కక్కుర్తి పడి అధికారులు అక్రమ నిర్మాణాలను చూసీ చూడనట్లు వ్యవహరి స్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కార్యాలయాల నుంచి బయటకు వచ్చి అక్రమ నిర్మణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. జెడ్‌ సి, డీసీ స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరఢా రaుళిపించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు