Sunday, September 8, 2024
spot_img

నిఫా కేసులు కొత్తగా నమోదు కాలేదు

తప్పక చదవండి
  • ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే తరగతులు జరుగుతాయని అధికారుల వెల్లడి

తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో నిఫా కేసులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నిఫా కేసుల నేపథ్యంలో కోజికోడ్‌ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 14 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే. అయితే సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి కొత్తగా నిఫా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో.. విద్యాసంస్థలు తిరిగి తెరుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విద్యాసంస్థలకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, హ్యాండ్‌ శానిటైజర్లు వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో విద్యాసంస్థలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నాటి నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యాసంస్థలు తెరుచుకోవడంతో ఆఫ్‌లైన్‌లోనే తరగతులు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. కేరళలో నిఫా కేసులు ఆరు నమోదు కాగా, ఇందులో ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 377 మంది శాంపిళ్లను పరీక్షించగా, 363 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు