Sunday, September 8, 2024
spot_img

ప్రపంచ రికార్డును సృష్టించిన నేపాలీ షెర్పా..

తప్పక చదవండి
  • హిమాలయాలను 42సార్లు అధిరోహించిన 53 ఏళ్ల కామ్‌ రీటా..
  • గైడ్‌గా పని చేస్తున్న రీటా మౌంట్‌ మనస్లు అధిరోహించారు..
  • వివరాలు వెల్లడిరచిన సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ జీఎం థానేశ్వర్‌..

ఖాట్మండూ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హిమాలయ శిఖరాలను అధిరోహించడమంటే ప్రాణాలతో చెలగాటమే. అలాంటిది నేపాల్‌కు చెందిన 53 ఏళ్ల పర్వతారోహకుడు కవిరీ రీటా ఏకంగా 42 సార్లు అధిరోహించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. తూర్పు నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాకు చెందిన కవిరీ రీటా గైడ్‌గా ఆయన పనిచేస్తున్నారు. సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్‌ సంస్థ చేపట్టిన 14 శిఖరాల యాత్రలో భాగంగా
మౌంట్‌ మనస్లూను అధిరోహించారు. దీంతో ఎనిమిది వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పర్వతాలను 42సార్లు అధిరోహించిన ఘనతను సాధించారు. గతంలో ప్రముఖ పర్వతారోహకుడు నిమ్స్‌ పుర్జా (41 సార్లు) పేరిట ఈ రికార్డు ఉంది. విరీ రీటా ఎవరెస్ట్‌ శిఖరాన్ని 28సార్లు అధిరోహించారు. ఇక కే`2, మౌంట్‌ వంటి శిఖరాలను ఒకసారి, మౌంట్‌ మనస్లూను నాలుగు సార్లు, మౌంట్‌ చో ఓయూ ఎనిమిది సార్లు అధిరోహించారు. ఈ విషయాన్ని సెవెన్‌ సమ్మిట్‌ ట్రెక్స్‌ జనరల్‌ మేనేజర్‌ థానేశ్వర్‌ గురగాయ్‌ విరీడియాకు వెల్లడిరచారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు