Sunday, September 8, 2024
spot_img

చంద్రబాబును జైల్లో అంతం చేసే కుట్ర..

తప్పక చదవండి
  • జైల్లో చంద్రబాబును చంపేందుకు ప్లాన్: నారా లోకేశ్
  • అనుమానాలు బలపడుతున్నాయి.
  • చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన
  • జైల్లో ఖైదీ చనిపోయాడంటూ ట్వీట్ చేశారు.
  • చంద్రబాబుపై కుట్ర చేస్తున్నారన్న లోకేష్

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీ మరణం కలకలంరేపుతోంది. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్ చేశారు.. చంద్రబాబు భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే బాధ్యత అన్నారు. తాజా పరిణామాలు చూస్తే గతంలో తమ అనుమానాలు నిజమవుతున్నట్లు అనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు హాని తలపెట్టేలా కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఆయన్ను జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందన్నారు. చంద్రబాబుకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోందని.. జైలు అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నారా లోకేష్ తన ట్వీట్‌లో ‘సైకో జగన్ చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది.‌ బాబు గారికి జైలులో భద్రత లేదు, విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు గారికి ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత’ అంటూ ఘాటుగా స్పందించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీ గంజేటి వీర వెంకట సత్యనారాయణ మృతిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ స్పందించారు. దోపిడీ కేసులో ఈనెల 6న సత్యనారాయణ జైలుకు వచ్చాడని.. జ్వరం, ప్లేట్‌లెట్లు లక్షన్నరకు పడిపోవడంతో 7న రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించామన్నారు. అత్యవసర వైద్య సహాయం కోసం ఈనెల 19న కాకినాడ జీజీహెచ్‌కు తరలించామని.. డెంగ్యూతో రిమాండ్‌ ఖైదీ బుధవారం మృతిచెందారని తెలిపారు. జైలులో దోమల నివారణకు సంబంధిత శాఖతో కలిసి చర్యలు చేపట్టామన్నారు. ఫాగింగ్‌ చేశామని.. ఇవాళ కూడా చేస్తామని చెప్పారు. జైలులో దోమల లార్వా ఆనవాళ్లేమీ లేవని డీఐజీ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము జైల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు