Sunday, September 8, 2024
spot_img

సీతారామచంద్రస్వామి దేవస్థానంలో “నాగపంచమి వేడుకలు”

తప్పక చదవండి
  • నాగపంచమి పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు..
    జనగామ : స్థానిక హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నాగపంచమి పురస్కరించుకొని భక్తులు నాగదేవతకు, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలో పాలు పోసి ఆరాధించారు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. శ్రావణ మాసంలో వచ్చిన మొదటి సోమవారం కూడా కావడంతో దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ రామనాథ స్వామి వారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో పాశం విమలారాణి, గజ్జెల స్వరూప, కందాడి వరలక్ష్మీ, యెలసాని శ్యామల, జక్కా జ్యోతి, సరోజన, కృష్ణవేణి, కవిత, శైలజ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానంలో వెలసిన నాగ దేవతకు శ్రావణ, కార్తీక మాసాల్లో పాలుపోసి ఆరాధించడం వలన సమస్త దోషాలు తొలిగిపోతాయని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం తెలియజేసారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు