Sunday, September 8, 2024
spot_img

సీఎం కేసీఆర్ ని మార్యదపూర్వకంగా కలిసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య

తప్పక చదవండి
  • నియోజక అభివృధ్ధికోసం రూ. 50 కోట్ల స్పెషల్ ఫండ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి..
  • సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్..

స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ మంజూరు కోరగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే డా.రాజయ్య తెలిపారు.. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.. హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని సీఎం కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిస్థితులను, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేపట్టిన పల్లెప్రగతి నివేదన యాత్ర-పల్లెనిద్ర కార్యక్రమాన్ని, నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ మంజూరి కోరగా సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి, వెంటనే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన రూ. 50 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఇతర అభివృద్ధి పనుల విషయమై సీఎం కేసీఆర్ అధికారులను వెంటనే ఆదేశించి త్వరితగతన నిధులు మంజూరు చేస్తూ.. పరిపాలన పరమైన అనుమతులు ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు.
స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి ఎమ్మెల్యే రాజయ్య తీసుకుపోయిన అభివృద్ధి పనుల వివరములు:-

  1. రఘునాథపల్లి మండలంలోని మండలగూడెం నుండి నక్కబొక్కల తండాకు పోయే దారిలో గల మండలగూడెం వాగుపై హై-లెవెల్ బ్రిడ్జ్ మంజూరు. 2. లింగాలగణపురం మండలంలోని చీటూరు వాగుపై హై-లెవెల్ బ్రిడ్జ్ మంజూరు. 3. రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ వాగుపై హై-లెవెల్ బ్రిడ్జి మంజూరు. 4. రఘునాథపల్లి మండలంలోని కన్నాయిపల్లి నుండి వయా కోడూరు మీదుగా లింగాలగణపురం మండలంలోని చీటూరు వరకు బీటీ రోడ్డు మంజూరు. 5. రఘునాథపల్లి నుండి ఇబ్రహీంపూర్ వరకు బీటీ రోడ్డు మంజూరు. 6. రఘునాథపల్లి మండలంలోని మండలగూడెం నుండి నక్కబొక్కల తండా వరకు బిటి రోడ్డు మంజూరు.. 7. స్టేషన్ ఘనుపూర్ వద్ద గల ఆర్.ఎఫ్. జాతీయ రహదారి నెం.163(పల్లగుట్ట క్రాస్ రోడ్) నుండి పల్లగుట్ట వరకు 7 కి.మీ. రోడ్డు వైడనింగ్ పనులు(డబల్ రోడ్డు) మంజూరు.
    8.చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రూ. 10 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు. 9. స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల హాస్పిటల్ నుండి 100 పడకల హాస్పిటల్ గా అప్గ్రేడేషన్ మంజూరు. 10. స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని అన్ని ఎస్టీ తండాలకు కనెక్టివిటీ రోడ్స్ మంజూరు. తదితర నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ మంజూరు విషయమై సీఎం కేసీఆర్ దృష్టి తీసుకపోగా సానుకూలంగా స్పందించడమే కాకుండా అప్పటికప్పుడు వెంటనే సంబంధిత శాఖల అధికారులను ఆదేశించి సత్వరమే సంబంధిత నిధుల మంజూరు విషయమై పరిపాలన అనుమతులు మంజూరు ఇవ్వవలసినదిగా అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో 100 బేడ్డేడ్ హాస్పిటల్ 100 పర్సెంట్ మంజూరు ఇస్తామని 100 శాతం హామీ ఇచ్చారని తెలిపారు.
    అంతే కాకుండా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని సీఎం భరోసానిచ్చారని తెలిపారు.

ఈ సందర్భంగా పైన పేర్కొనబడిన నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయంలో, నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ మంజూరు విషయమై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినందుకు గాను రాజయ్య సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో జూన్ 2 , 2023 నుండి జూన్ 22 వరకు 21 రోజులపాటు చేపట్టిన పల్లెప్రగతి నివేదన యాత్ర-పల్లెనిద్ర కార్యక్రమానికి సంబంధించిన రోజువారి కార్యక్రమాలతో కూడిన ఫోటోగ్రఫీ బుక్ లెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందజేయగా, అది చూసిన సీఎం ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యని అభినందించారని తెలిపారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు