Sunday, September 8, 2024
spot_img

మహిళా కళాశాలలో మాయని మచ్చ..

తప్పక చదవండి
  • నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో వెలుగు చూసిన మరో భారీ అవినీతి..
  • ఇది కూడా సోకాల్డ్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ హయాంలోనే..
  • అవినీతి ఘటనలో 8 మందిపై అప్పట్లో కేసు నమోదు..
  • కేవలం ఏ 6 గా ఉన్న ఒక ఉద్యోగిని మాత్రమే తొలగించిన నవీన్ మిట్టల్..
  • మిగతా 7 మంది పరిష్టితి ఏమిటి..? వారితో ఈయనకున్న లాలూచీ ఏమిటి..?
  • శివ, శివా అంటూ చెవులు పట్టుకుంటున్న సామాజిక వేత్తలు..

ఏమిరా బాలరాజు.. ఏమిరా ఇదీ అని అడిగితే.. ఏముంది ఎక్కడ అవకాశముంటే అక్కడ అవినీతి చేయడమే నాపని అన్నాడట ఒకడు.. ఆ కోవలో ముందువరసలో ఉంటాడు మన నవీన్ మిట్టల్ ఐఏఎస్.. ఇతని అవినీతి భాగోతాల గురించి చెప్పుకుంటూ పోతే పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రచించవచ్చు.. ప్రస్తుతం ఒక పేజీని చూద్దాం..

నల్గొండ మహిళా కళాశాలలో ఒక భారీ అవినీతి జరిగింది.. వివరాల్లోకి ఒకసారి వెళ్తే.. నల్గొండ మహిళ డిగ్రీ కళాశాలలో రూ. 46,64,848/- భారీ అవినీతి జరిగినట్టు అప్పటి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ (సీసీఈ) నవీన్ మిట్టల్ అదేశానుశారం.. 2018లో రిటైర్డ్ ఆర్.జె.డీ. దర్జాన్, నల్గొండ టూ-టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. క్రైమ్ నెంబర్ : 273/2018 కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. వారిపై ఐపీసీ 420, 406, 409 సెక్షన్లల కింద కేసు నమోదు చేసారు.

- Advertisement -

అయితే ఇక్కడే మన నవీన్ మిట్టల్ సారు చక్రం తిప్పారు.. 8మందిపై కేసు నమోదు చేస్తే అప్పుడు కమిషనర్ గా విధులు వెలగబెడుతున్న ఈయన కేవలం ఏ6 గా ఉన్న నిందితుడిని మాత్రమే ఉద్యోగంలో నుండి తొలగించారు.. వింత ఏమిటంటే ఏ6 స్టోర్ కీపర్, ఒక్క స్టోర్ కీపర్ రూ. 46,64,848/- నిధులు గోల్ మాల్ చేస్తాడా..? అనే సందేహం వెల్లువెత్తుతోంది.. తప్పు చేసిన వారిని కాపాడటానికి అమాయకులను బలిచెయ్యడం ఈయనగారి పరిపాటిగా మారిపోయింది..

డిపార్ట్మెంట్ నుండి విచారణ చేసిన అధికారులు మిగితా వారిని కాపాడుతూ.. వారికి పూర్తిగా అండదండలు అందిస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కేసును నత్త నడక సాగేటట్టు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది కోర్ట్ ను ఆశ్రయించి అరెస్టు చెయ్యకుండా ముందస్తు బెయిల్ పొంది రూ. 46,64,848/- ప్రభుత్వ సొమ్ము దోచుకొని.. స్వేచ్ఛగా తమ విధులు నిర్వహిస్తున్నారు.. వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు అన్నీ సమయానికి అందిస్తూ.. ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది ముఖ్యమైన అధికారులు, యూనియన్ నాయకులు కాపాడుకుంటున్నారు…

ఇంత నిధుల దోపిడీ జరిగిన వారిపై శాఖా పరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ అవినితి తంతుపై పై అధికారులను వివరణ కోరితే.. అది కోర్టు పరిధిలో ఉంది అంటూ దాటేస్తున్నారు. కోర్టు సీసీ నెంబర్ : 1573/2021.

కేసు నీరుగారుస్తూ జాప్యం చేయడంలో ఎవరు హస్తం ఉంది..?
ఏ 1 నుండి ఏ 8 వరకు అందరూ ఈ అవినీతికి భాద్యులు.. అలాంటప్పుడు అందరికి ఒకే చట్టం వర్తిస్తుంది కదా..? మరెందుకు అందరిపైనా ఓకే రకమైన చర్యలు తీసుకోలేదు అనేది పెద్ద సందేహం.. కొంతమంది నిందితులకు రాజకీయ నాయకుల అండదండలు, పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఇదే కాకుండా ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారుల అండదండలు కూడా వారికి కలిసివచ్చిన అంశం.. ఈ సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని అధికారులకు భారీగా ముడుపులు సమర్పించుకొని.. స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు అర్ధం అవుతోంది.. కాగా అమయకులను బలి చేస్తూ ఉద్యోగం నుండి తొలగింపు వంటి దుర్మార్గపు చర్యలు తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నత విద్యాశాఖలో ఆర్.జె. డీ, జేడీ, ఏజీఓల ప్రక్షాళన జరిగితే తప్ప కేసు ముందుకు వెల్లదని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంపై నూతన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు