Sunday, September 8, 2024
spot_img

మంత్రి దామోదర రాజనర్సింహ గారు జరా ఇదర్ దేకో..

తప్పక చదవండి
  • గాడి తప్పిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాలన..
  • అమీన్పూర్ మున్సిపాలిటీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు..
  • అవినీతి మత్తులో జోగుతున్న టౌన్ ప్లానింగ్,ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు..
  • చెరువు కబ్జాపై చర్యలు తీసుకొనుటకు వెనుకడుగేస్తున్న ఇరిగేషన్ ఏ.ఈ ప్రసాద్..
  • కబ్జాదారులకు, అక్రమ నిర్మాణదారులకు వంత పాడుతున్న అధికార యంత్రాంగం..
  • అక్రమాలకు సహకరిస్తున్న అధికారులను విధుల నుండి తొలగించాలంటూ స్థానికుల డిమాండ్స్..

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కేంద్రంగా వాణి నగర్ లో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి.. మరలా బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనుకొని కొంతమంది
భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులు యదేచ్ఛగా వాణినగర్ లోని చెరువు పై కన్నేశారు.. ఎలక్షన్ పనిలో అధికారులు బిజీగా ఉంటారని.. ఆ సమయంలో నిర్మాణాలు చేసుకున్న..అధికారులు రారు అని..స్థానిక సంబంధిత అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని యదేచ్చగా నిర్మాణ పనులు కొనసాగించారు.. అక్రమ నిర్మాణాల విషయం ఇరిగేషన్ ఏఈ ప్రసాద్ దృష్టికి పోయిన.. ఆ వైపు కన్నెత్తి చూడకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది..

ఆమ్యామ్యాలు ఇయ్యని వారి నిర్మాణాలను కూల్చివేసి, చెరువు కబ్జా చేసి ముడుపులు ముట్ట చెప్పిన వారి అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం సదరు అధికారి అవినీతికి అద్దం పడుతుంది.. ఇదే తరహా లో ప్రభుత్వ ఖజానాకు కన్నం పెడుతూ నిర్మాణ అనుమతులు లేకుండా వాణి నగర్ లో విద్యుత్ శాఖ నిబంధనలు తుంగలో తొక్కి యదేచ్చగా హై టెన్షన్ వైర్ల కింద అమీర్పూర్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే నిర్మాణాలు చేస్తున్నారు.. గత సంవత్సరం అదే హై టెన్షన్ కరెంటు లైన్ కింద నిర్మాణం చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన విషయం తెలిసిన అధికారులు మరలా అలాంటి సంఘటన పునరావృతం కాకుండా అక్రమ నిర్మాణాలను నిర్మించకుండా కట్టడి చేయాల్సి పోయి.. అవినీతి మత్తులో జోగుతూ అక్రమ నిర్మాణాలను సజావుగా సాగేట్లు నిర్మాణ పనులను నిలిపివేయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్న అధికారులను విధుల నుండి తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి..

- Advertisement -

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి పోయిన ఎలాంటి చర్యలు అధికారుల పై అక్రమ నిర్మాణాలపై తీసుకోకపోవడం ఈ ప్రాంతంలో భూ కబ్జాలు అక్రమ నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి.. వాణి నగర్ చెరువులో కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల వ్యవహారంపై అమీన్పూర్ తహశిల్దార్ నీ వివరణ కోరగా ఇరిగేషన్ ఏఈ ప్రసాద్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి పిలిచిన రావడం లేదంటూ తెలిపారు.. చెరువులో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి వాణి నగర్ లో నిర్మిస్తున్న భారీ షెడ్డు కు సంబంధించి హై టెన్షన్ కరెంట్ లైన్ల కింద నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ నీ వివరణ కోరగా అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలుపారు.. మంత్రి దామోదర రాజనర్సింహ గారు మీ ఇలాకాలో అధికారులు విధులను యాది మరిచి అవినీతి అక్రమాలే తమ విధులుగా భావిస్తూ చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడానికి విఫలమవుతున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా అవినీతికి తావు లేకుండా అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసే విధంగా చర్యలు తీసుకొని ప్రేక్షక పాత్ర వహించి విధులను యాది మరిచిన అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించి పారదర్శకమైన పాలన అందించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. అమీన్పూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు