Sunday, September 8, 2024
spot_img

నోడల్ అధికారులతో సమావేశం..

తప్పక చదవండి
  • జిల్లా కలెక్టర్ సీ.హెచ్. శివ లింగయ్య అధ్యక్షతన కార్యక్రమం..

జనగామ : ఎన్నికల నేపథ్యంలో నియమించిన నోడల్ అధికారులతో, సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య. ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, జనగామ రిటర్నింగ్ అధికారులు అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, సుహాసినిలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో నియమించిన నోడల్ అధికారులు వారికి కేటాయించిన పనులు సమీక్షించుకోవాలని తెలిపారు.. మ్యాన్ పవర్ కమిటీ, ట్రైనింగ్ కమిటీ, మెటీరియల్ మేనేజ్మెంట్, ట్రాన్స్ పోర్ట్, సైబర్ సెక్యూరిటీ కమిటీ, స్వీఫ్ కమిటీ, లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ కమిటీ, ఈవిఏం మేనేజ్మెంట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంచనాల కమిటీ, బ్యాలెట్ పేపర్ కమిటీ, ఎంసి ఎంసి కమిటీ, కమ్యూనికేషన్ ప్లాన్, తదితర జిల్లా స్థాయి కమిటీలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన నోడల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. జిల్లాలో మూడు నియోజకవర్గాల వారీగా ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై ప్రత్యేక క్యాంపెనింగ్ చేయడం ప్రారంభించామని ఓటు హక్కు వినియోగం గురించి యువతీ, యువకులు అవగాహన కలిగి ఉండాలన్నారు..
ఈ సమావేశంలో జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, ఈఆర్వోలు మురళీకృష్ణ రామ్మూర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, జిల్లా స్వీఫ్ నోడల్ ఆఫీసర్ వినోద్ కుమార్, సంబంధిత నోడల్ ఆఫీసర్స్ కలెక్టరేట్ పరిపాలన అధికారి పి. రవీందర్, ఎన్నికల పర్యవేక్షకులు ఎతే శాంఅలీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు