Sunday, September 8, 2024
spot_img

ప్లేయింగ్‌ కార్డ్స్‌తో భారీ నిర్మాణం

తప్పక చదవండి
  • గిన్నిస్‌బుక్‌లో 15 ఏళ్ల బాలుడికి చోటు

న్యూజెర్సీ: జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలే గానీ, సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అందుకు తగ్గట్టు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించగలం. అందుకు నిదర్శనమే ఈ 15 ఏళ్ల బాలుడు. తన ప్రతిభతో ఏకంగా వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. కోల్‌కతా కు చెందిన 15 ఏళ్ల అర్నవ్‌ ప్లేయింగ్‌ కార్డ్స్‌తో అసాధారణ రీతిలో భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్‌ కార్డ్స్‌ను ఉపయోగించి.. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్‌ మినార్‌, సాల్ట్‌ లేక్‌ స్టేడియం, ఎస్‌టీ. పాల్‌ కేథడ్రల్‌లను నిర్మించి రికా ర్డు సృష్టించాడు. కేవలం 41 రోజుల్లోనే ఈ నాలుగు నిర్మాణాలను పూర్తిచేశాడు. ఎలాంటి టేపు సాయం లేకుండా ఈ భవనాలను నిర్మించడం విశేషం. ఇప్పుడు ఈ నిర్మాణం ప్రపంచంలోనే ‘అతిపెద్ద ప్లేయింగ్‌ కార్డ్స్‌ నిర్మాణం’ గా రికార్డుకెక్కింది. గతంలో బ్రయాన్‌ బెర్గ్‌ పేరిట ఉన్న రికార్డును అర్నవ్‌ బద్దలు కొట్టాడు. ఈ విషయాన్ని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచింది. కాగా, అర్నవ్‌ చేపట్టిన ఈ మొత్తం ప్రాజెక్ట్‌ పొడవు 40 అడుగులు కాగా, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాలు అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు