Sunday, September 8, 2024
spot_img

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన మాగంటి గోపీనాథ్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరోసారి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్వార్లతో హల్‌చల్‌ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎర్రగడ్డ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోను స్వయంగా ఎమ్మెల్యే మాగంటి తన సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేశాడు. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తల్వార్లతో పోటీ చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ విన్యాసాలు జరిగే సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలు వాడటం ఏంటని ఈసీకి జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు