Sunday, September 8, 2024
spot_img

విచ్చలవిడిగా మద్యం, మాదకద్రవ్యాల అమ్మకాలపై ఎక్సైజ్ శాఖఅధికారులను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్..

తప్పక చదవండి
  • మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం..
  • ఉప్పల్ ఎక్సైజ్ శాఖ సిఐ, ఎస్సైలను నీలదీసిన బిజైవైయం..

ఉప్పల్ నియోజకవర్గంలో డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలు విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఏన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.. ఉప్పల్ అసెంబ్లీ బిజైవైయం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నేలపై కూర్చొని నిరసన తెలపడం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలమైందని.. ఉప్పల్ నియోజకవర్గంలో మద్యం, మాదకద్రవ్యాల అమ్మకాలు విపరీతంగా, విచ్చలవిడిగా కొనసాగిస్తున్నాయని, పారిశ్రామిక వాడలు గంజాయి కేంద్రలుగా మారాయని, దానితోపాటు అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, వైన్ షాపులు పోటిపడి బస్తీల్లో బెల్టుషాపులు పెట్టి పేదప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఎక్సైజ్ శాఖ ఆదాయం 14,500 ఉంటే కెసిఆర్ పుణ్యమా అని వీధి వీధికి బారు ఇంటికి బీరు అన్నట్లుగా పేద ప్రజల రక్తం తాగుతూ నాలుగు ఇంతలు పెరిగి 43వేల కోట్లకు చేర్చుకోని ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని, మరోవైపు అనైతిక, అసాంఘిక కార్యకలాపాల వెనుక ఈ మద్యం ఉంది మాదకద్రవ్యాలు ఉన్నాయని.. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని.. యువత పెడదారి పడుతోందని, కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజైవైయం జిల్లా అధ్యక్షులు చల్లా ప్రభాకర్, బిజెపి చిలుకానగర్ డివిజన్ అధ్యక్షులు గోనె శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు సందీప్ యాదవ్, అభిషేక్ గౌడ్, తెలంగాణ సంపత్, ఘనబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, నామా శ్రవణ్, మహేశ్వర్ రెడ్డి, ఆకుల రుషికేశ్, బిజైవైయం డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్, డప్పు దత్తసాయి, యం. దేవేందర్, అశోక్ ముదిరాజ్, బిజైవైయం నాయకులు రావుల అఖిలేష్ గౌడ్, గొరిగే శ్రీకాంత్, ఆకుల రాజ్ కుమార్, వినయ్ రెడ్డి, గోపాల్, సుమన్ నాయక్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు