Sunday, September 8, 2024
spot_img

గ్రంథాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి
  • తెలంగాణ గ్రంథాలయ వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు

హైదరాబాద్ : గ్రంథాలయ సంస్థలోని ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ, గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రాన్ని ట్విట్టర్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలంగాణ గ్రంథాలయ వేదిక పంపదమైనది.. గ్రంథాలయాల్లో పేరుకుపోయిన అనేక సమస్యలను వినతి పత్రంలో వివరిస్తూ, గ్రంథాలయాల పట్ల ప్రభుత్వం.ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించాలని కోరారు. గ్రంథాలయాల పట్ల నిరాసక్తత చూపకుండా గ్రంథాలయాలను మరింత అభివృద్ధి పరుస్తూ విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారికి ఉపయోగపడే అన్ని పుస్తకాలు అందుబాటలో ఉంచాలని తెలంగాణ గ్రంథాలయ వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోమటి మత్స్య గిరి కోరారు. గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలుగా తీర్చి ద్ధిద్ధాలని కోరారు. పక్కా భవనాలు నిర్మించాలని తెలంగాణ పౌర గ్రంథాలయాల శాఖా మాత్యులు సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ దేవసేన, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అయాచిత శ్రీధర్, సంచాలకులు శ్రీనివాసాచారిలకు ట్విట్టర్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిన వినతి పత్రంలో కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు