Sunday, September 8, 2024
spot_img

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి..

తప్పక చదవండి
  • తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారు..
  • తెలంగాణ విమోచనా దినాన్ని రాజకీయం చేస్తున్నారు..
  • అలాంటి వారిని ప్రజలు ఎప్పుడూ క్షమించరు..
  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ
    విమోచన దినోత్సవ వేడుకలు..
  • కేంద్ర బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా..

హైదరాబాద్ : కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా హాజరయి.. జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వార్ మెమోరియల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సశస్త్ర సీమ బల్‌ను వర్చువల్‌గా అమిత్‌షా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచనం కోసం పోరాడిన వీరులకు వందనమన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని, సర్దార్‌ పటేల్‌, మున్షీ వల్లే నిజాం పాలన అంతమైందని అన్నారు. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారని, నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటును సరిచేశారని అమిత్ షా అన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా వక్రీకరించిందని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు క్షమించరని అమిత్‌ షా అన్నారు.

కాగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కళారూపాలు, బతుకమ్మ, బోనాలు, పోతరాజు విన్యాసాలు, సన్నాయి, డప్పు, వొగ్గు డోలు, కోలాటం, గుస్సాడి నృత్యం, చిడుతలు, తదితర తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కళారూపాలు , సాంస్కృతిక కార్యక్రమాలు కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రదర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు