Sunday, September 8, 2024
spot_img

కొత్తగూడెంలో ప్రజా పాలన తెచ్చుకుందాం

తప్పక చదవండి
  • కూనంనేని నామినేషన్‌కు తరలివచ్చిన జనం
  • మార్కెట్‌యార్డు నుండి భారీ ప్రదర్శన
  • ప్రదర్శనలో నారాయణ, పొంగులేటి, కూనంనేని

కొత్తగూడెం : కొత్తగూడెంలో అరాచకాలు, ఆత్మహత్యలతో కూడిన రాక్షస పాలనను అంతం చేసి, ప్రజా పాలనను తెచ్చుకుందామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్‌ప్రచార కమిటీ కోకన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబవివరావు అన్నారు. సిపిఐ రా ష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు నామి నేషన్‌ను పురస్కరించుకొని బుధవారం పట్టణానికి జిల్లా నలుమూ లల నుండి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఎర్రచీరలు, చొక్కాలు ధరించి లక్ష్మీదేవిపల్లి మార్కెట్‌ యార్డునుండి భారీప్రదర్శన నిర్వహించారు. మార్కెట్‌యార్డునుండి ప్రారంభమైన ప్రదర్శన మొర్రేడు బ్రిడ్జి, సూపర్‌బజార్‌, బస్టాండ్‌ మీదుగా పోస్టాఫీస్‌ సెంటర్‌ వరకు సాగింది.డప్పువాయిద్యాలు, నృత్యాలతో ప్రదర్శన ప్రజలను ఆకర్షింప చేసే విధంగా ఉంది.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి లేదని, అధికార యంత్రాంగం చట్టబద్ధంగా పని చేసే పరిస్థితి లేదని, ఇందుకు కారణం వనమా కుటుంబమే అని విమర్శించారు. ఇక్కడ వనమా కుటుంబం,అక్కడ కల్వకుంట్ల కుటుంబం ప్రజలను దోచుకుతింటున్నారన్నారు. తెలంగాణ సాధ న కోసం సిపిఐ బహుముఖ పోరాటాలు నిర్వహించిన సంగతి ప్రజ లకు విధితమే అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ పాలన యువత ఉసురు తీసుకుందని, పేపర్‌ లీకేజీ వ్యవహరంతో యువత జీవితాలతోచెలగాటం ఆడారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం సంగతి దేవుడికెరుకని, ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో తెలంగాణ ఉందన్నారు. ఈ అవినీతి అరాచక పాలన అంతం కోసమే కాంగ్రెస్‌, సిపిఐ పోటీ చేయాలని భావించాయని దీనికి టీజెఎస్‌ కూడా మద్దతు పలగడం గర్వకాణమన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఎం సైతం తనను బలపరుస్తోందని, ఒప్పం దానికి కట్టుబడి కాంగ్రెస్‌, సిపిఐ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరం కలిసి బీఆర్‌ఎస్‌ను ఓడిరచి తెలంగాణకు విముక్తి కలిగించాలన్నారు. కెసిఆర్‌ కుటుంబ అరాచకాలకు చరమగీతం పాడాలన్నారు. అందుకు నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, పద్మ, వాసిరెడ్డి సీతారాములు, పోటుప్రసాద్‌, సాబీర్‌పాషా, బి.అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్‌, మౌలానా, సురేష్‌, దయానంద్‌, నగేష్‌, రామనాథం, ఆళ్ల మురళీ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు