Sunday, September 8, 2024
spot_img

ఖైరతాబాద్ ఓటర్ల చూపు మన్నే వైపు

తప్పక చదవండి
  • సీట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు ఉంటాయన్న
    కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆశగా ఎదురు చూస్తున్న మన్నే వర్గం..
  • నియోజకవర్గంలో దానంకు అసమ్మతి సెగ..
  • ఆయనను స్వంత పార్టీ నేతలే దూరం పెడుతున్నారా ?
  • ఖైరతాబాద్‌లో మన్నేకు పాజిటివ్‌, దానంకు నెగటివ్‌..
  • మన్నే గోవర్ధన్‌కు టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు..
  • పలు సర్వేలు సైతం మన్నేకు అనుగుణంగా ఉన్నాయి..
  • కేసీఆర్‌గారు ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై జర నజర్‌ పెట్టండి
    పిలిస్తే పలికే ప్రజా నాయకుడిగా పేరొందిన స్వర్గీయ పీ. జనార్దన్‌ రెడ్డి కనుసన్నలలో నడయాడిన ఖైరతాబాద్‌ ప్రజానీకం.. ఇప్పుడు అలాంటి ఔన్నత్యాన్ని మన్నే గోవర్ధన్‌ లో చూసుకుంటున్నారు.. పీజేఆర్‌ లాంటి మహోన్నత నేత అందించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం మన్నే గోవర్ధన్‌ మాత్రమే చేపట్టగలరని వారు విశ్వసిస్తున్నారు.. రెండు దఫాలుగా గెలిచిన దానం నాగేందర్‌ ప్రవర్తనతో విసిగిపోయిన ఖైరతాబాద్‌ ఓటర్లు గోవర్ధన్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్నది వాస్తవం. కేవలం నియోజకవర్గ ప్రజలే కాకుండా బీ.ఆర్‌.ఎస్‌. స్థానిక నాయకులు సైతం దానం నాగేందర్‌ పై వ్యతరేక భావాన్ని వెలిబుచ్చుతున్నారు.. ఇదే కాకుండా కొందరు బీ.ఆర్‌.ఎస్‌. సీనియర్‌ నాయకులు సైతం దానం నాగేందర్‌ అహంకారంపై పలు సందర్భాల్లో చెప్పిన విషయాలు కూడా తెలిసిందే.. అప్పట్లో సర్గీయ నాయిని నర్సింహారెడ్డి, దానం నాగేందర్‌ అహంకార వైఖరి పై చేసిన వ్యాఖ్యలు సంచలం సృష్టించాయి.. కాగా పలు సర్వేలు సైతం మన్నే గోవర్ధన్‌ కు అనుకూలంగా వస్తుండటం ఇక్కడ గమనార్హం.. ఈ క్రమంలో అధినేత కేసీఆర్‌ దానం పేరును ప్రకటించడంతో వారంతా నిరాశలో కూరుకుపోయారు.. అయితే చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు వుంటాయని కేసీఆర్‌ చెప్పిన మాటలతో వారిలో తిరిగి ఆశలు చిగురించాయి.. ఎలాగైనా మన్నే గోవర్ధన్‌ కు కేసీఆర్‌ టికెట్‌ అనౌన్స్‌ చేస్తారని వారు ఆశిస్తున్నారు..
  • హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన సీట్లలో మార్పులు ఉంటాయంటూ వస్తున్న ఊహాగానాలు ఆశావహులకు ఊపిరినిస్తుందని చెప్పకతప్పదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఒకేసారి 115 మందికి టికెట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచారు గులాబీ బాస్‌. అయితే సీట్లు దక్కించుకున్న అభ్యర్ధులకు ఆనందం ఎక్కువ రోజులు నిలిచే అవకాశం కనిపించడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీట్లు ప్రకటించిన రోజు.. వారి పెదవులపై కనిపించిన చిరునవ్వు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో మటుమాయమై పోయింది. ఇప్పుడు వారి ముఖాలు ఆందోళనతో కనిపిస్తున్నాయి. కారణం.. ఈ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులుంటాయని చివరలో కేసీఆర్‌ చెప్పడమే దీనికి కారణం .అయితే బీఆర్‌ఎస్‌ ఫస్ట్‌ లిస్ట్‌ ప్రకటించిన కేసీఆర్‌ వాళ్లందరికీ చివరి నిమిషంలో ట్విస్ట్‌ ఇవ్వడంతో వాళ్లకు బీ ఫారం ఇస్తారా? లేదా? అన్న అనుమానాలకు తెరలేచింది. దీంతో సీట్లు దక్కించుకున్న వారిలో టెన్షన్‌ మొదలయింది. వాటిలో కొన్ని మార్పు చేర్పులుంటాయని కేసీఆర్‌ చెప్పకుంటే.. సీట్లు ఖాయమైన అభ్యర్ధులకు ఎలాంటి ఆందోళన ఉండేది కాదు. మరోవైపు సీటు దక్కించుకోలేకపోయిన తాడికొండ రాజయ్య.. బేతి సుభాష్‌, మన్నే గోవర్ధ రెడ్డిలు సీటుపై ఇంకా ఆశలు పెట్టుకోవడం చూస్తుంటే.. మార్పులు అనివార్యమన్న సంకేతాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అభ్యర్థుల లిస్ట్‌ ప్రకటించినప్పటికీ సీటుపై ఆశలు కోల్పోవడం లేదు కొంతమంది నేతలు . దీంతో మార్పులు అనివార్యమన్న వాదనలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టిక్కెట్‌ ఖాయమైన గులాబీ నేతలు ప్రజా ఆశీర్వాద యాత్రలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. టిక్కెట్‌ దక్కని ఎమ్మెల్యేలు మాత్రం అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారు. కొందరైతే తమకే అవకాశం ఇవ్వాలని బలప్రదర్శనకు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ నియోజకవర్గం స్థానం మారుస్తారని.. కార్యకర్తలు బలపరిచే మన్నే గోవర్ధ రెడ్డికి అవకాశం ఇస్తారని నియోజకవర్గంలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది..
    గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ నియోజకవర్గం రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిపోయింది. ఒకప్పటి కాంగ్రెస్‌ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో గడిచిన రెండు పర్యాయాలుగా అధికార పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌ గెలిచినప్పటికీ, నియోజకవర్గం ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదు. నగరానికి ఐకాన్‌ గా ఉన్న నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలు నాయకులను వెక్కిరిస్తున్నాయి. దీంతో ఈసారి దానంకు అవకాశాలు సన్నగిల్లాయని బీఆర్‌ఎస్‌ నేతలే చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ లోకి వచ్చిన దానం అధికార పార్టీకి చెందిన నేతలను దగ్గరికి తీసిన దాఖలాలు లేవని, స్వంత పార్టీ నేతలే పనిగట్టుడుకుని ప్రచారం చేస్తున్నారు. గతంలో పిలిచినా పలకని దానం ఇప్పుడు పిలువకుండానే పలుకుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దానం నాగేందర్‌ కు ఎదురుగాలి వీస్తుందని, ఆయనకి టికెట్‌ ఇస్తే ఖచ్చితంగా ఓటమి పాలవడం ఖాయమని బీఆర్‌ఎస్‌ నేతలే స్పష్టం చేస్తున్నారు.
    మన్నే గోవర్ధ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు :
    లీడర్‌ ప్రజల్లోంచి పుడతాడు.. .ప్రజలకోసం జీవిస్తాడు.. ప్రజల సంక్షేమమే ద్యేయంగా ఆలోచిస్తూ ప్రజల గుండెల్లో కొలువుంటాడు. అలా ప్రజలకోసం నిరంతరం పరితపించే నాయకుడికి ప్రజలు పట్టం కడతారు. నిజానికి ఖైరతాబాద్‌ ప్రజలు పీజేఆర్‌ లాంటి మరోనేతను ఇప్పటివరకు చూడలేదు. ఇపుడు మళ్ళీ ఖైరతాబాద్‌ ప్రజలు ఓ పీజేఆర్‌ లాంటి ప్రజల గుండె చప్పుడు తెలిసిన నాయకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. పీజేఆర్‌ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఒకే ఒక్క నాయకుడు మన్నే గోవర్ధ రెడ్డి. పేదలంటే ప్రాణమిచ్చే నాయకుడిగా మన్నే గోవర్ధ రెడ్డి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అన్నా..అని పిలిస్తే చాలు నేనున్నానని పీజేఆర్‌ రూపంలో కనిపిస్తున్నాడు. మన్నె గోవర్ధన్‌ రెడ్డి అన్నకే ఈసారి మా మద్దతు ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో మంచి పేరు, గుర్తింపు ఉన్న లీడరుగా మన్నే గోవర్ధ రెడ్డికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలు, బీఆర్‌ఎస్‌ నాయకులు పట్టుబడుతున్నారని సమాచారం. ఆయనకే ఛాన్స్‌ ఇస్తాం అని ఖైరతాబాద్‌ ఓటర్లు తెగేసి చెబుతున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దీవెనలతో వెన్నలాంటి మనసున్న మన్నే గోవర్ధన్‌ ఈసారి బరిలో నిలవబోతున్నాడని ప్రజలు భావిస్తున్నారు.
    దానం ఓ ఆవేశపరుడు :
    ఖైరతాబాద్‌ ప్రజలు ఆరాధ్యదైవంగా కొలుచుకునే పీజేఆర్‌ కు అత్యంత ప్రియ శిష్యుడిగా పేరు తెచ్చుకుని, రాజకీయంగా ఎదిగిన దానం రాజకీయంగా ఎదిగిన తరువాత పీజేఆర్‌ సామజిక వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తన రాజకీయ ఉన్నతికి స్వంత కొఠారిని ఏర్పాటు చేసుకుని పలు భూకబ్జాలు, ఆక్రమణలు, అవినీతికి పాల్పడ్డారని స్వంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు.. తనకు అవసరమున్నప్పుడు ఒకలా.. అవసరం తీరక మరోలా ప్రవర్తించే దానం సహజ గుణాన్ని ఖైరతాబాద్‌ ప్రజలు, అధికార పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడా గణేశుడు విగ్రహం ప్రతిష్టించే స్థలంగా దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్న ఖైరతాబాద్‌ నియోజకవర్గాన్ని దానం చేతుల నుండి విడిపించాలని ఖైరతాబాద్‌ ప్రజలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి చూడాలి అధినేత కేసీఆర్‌ ఎలాటి నిర్ణయం తీసుకుంటారు అన్నది. పేరు తెచ్చుకుని, రాజకీయంగా ఎదిగిన దానం రాజకీయంగా ఎదిగిన తరువాత పీజేఆర్‌ సామజిక వర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తన రాజకీయ ఉన్నతికి స్వంత కొఠారిని ఏర్పాటు చేసుకుని పలు భూకబ్జాలు, ఆక్రమణలు, అవినీతికి పాల్పడ్డారని స్వంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు.. తనకు అవసరమున్నప్పుడు ఒకలా.. అవసరం తీరక మరోలా ప్రవర్తించే దానం సహజ గుణాన్ని ఖైరతాబాద్‌ ప్రజలు, అధికార పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడా గణేశుడు విగ్రహం ప్రతిష్టించే స్థలంగా దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్న ఖైరతాబాద్‌ నియోజకవర్గాన్ని దానం చేతుల నుండి విడిపించాలని ఖైరతాబాద్‌ ప్రజలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి చూడాలి అధినేత కేసీఆర్‌ ఎలాటి నిర్ణయం తీసుకుంటారు అన్నది..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు