Sunday, September 8, 2024
spot_img

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు

తప్పక చదవండి
  • కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే
  • పలువురు నేతల చేరికతో కాంగ్రెస్‌లో జోష్‌
  • నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యం
  • నేడు కేసీఆర్‌ను సాగనంపడమే కర్తవ్యం
  • కేసీఆర్‌ అంతటి అవినీతి నేత దేశంలోనే లేడు
  • మీడియాతో కాంగ్రెస్‌ నేత జూపల్లి
    న్యూఢిల్లీ : ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్‌ల సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు. జూపల్లి సహా కూచుకుల్ల రాజేశ్‌ రెడ్డి, వనపర్తి నేత మెగారెడ్డి, మాజీ శాసనసభ్యులు గుర్నాథ్‌ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలకు ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, ఇంచార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. వందలాది మంది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రమేనా ఇది అనిపిస్తుందన్నారు. దుర్మార్గ, అవినీతి, అహంకారపూరిత కేసీఆర్‌ లాంటి మనిషి ఎక్కడా లేరన్నారు. ఇంతటి అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదని తెలిపారు. రాక్షస మనస్తత్వం కేసీఆర్‌ దని.. నాడు ఉద్యమ సమయంలో లక్షకు గతి లేదని… ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లకు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారని… ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయిందన్నారు. తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా సచివాలయం వెళ్ళని సీఎం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నారా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఉన్నా సరే, పార్టీకి నష్టం జరుగు తుందని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో నూటికి నూరుపాళ్లు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇచ్చి సోనియా రుణం తీర్చుకోవాలని తెలిపారు. కర్ణాటకలో అవినీతి బీజేపీ సర్కారును ఓడిరచిన మాదిరిగా… అంతకు మించి అవినీతిలో కూరుకున్న కేసీఆర్‌ సర్కారును కూడా ఒడిరచాలని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు