Sunday, September 8, 2024
spot_img

వెస్టిండీస్‌తో టీ20లో భారత్‌ పరాజయం

తప్పక చదవండి
  • వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో టీమ్‌ఇండియా ప్రభావం చూపలేకపోయింది.
  • ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక పోరులో
    భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో ఓడింది.
  • అయితే ఈ మ్యాచ్ ఓట‌మిపై అలాగే తొలిసారి అతడి కెప్టెన్సీలో సిరీస్‌ ఓడిపోవడంపై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య స్పందించాడు.
  • “నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఉన్న ఫామ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాం. వేగంగా రన్స్ చేయలేకపోయాము. ఈ ఓటమిపై ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మా ఆటగాళ్లు ఎలా ఆడారనేది నాకు తెలుసు. గెలుపు, ఓటములు అనేవి ఆట‌లో ఒక భాగం. మాకు వ‌న్డే ప్రపంచకప్ వస్తోంది. కొన్నిసార్లు ఓడిపోవడం కూడా మంచి చేస్తుంద‌ని నేను న‌మ్ముతాను. ఎందుకంటే ఓట‌మిలో చాలా విషయాలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మా అబ్బాయిలందరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక ఈ మ్యాచ్‌ను చూడ‌టానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ అమెరికాలోనే జరగనుంది. అప్పుడు ఇంకా ఎక్కువ‌మంది అభిమానులను కలుస్తాం” అని పాండ్య చెప్పుకొచ్చాడు.
    ఇక టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌సెంచరీతో రాణించగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (55 బంతుల్లో 85 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. పూరన్‌ (35 బంతుల్లో 47; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో తిలక్‌వర్మ, అర్ష్‌దీప్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు