Sunday, September 8, 2024
spot_img

హైదరాబాద్‌.. టీ-హబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు..

తప్పక చదవండి
  • వివిధ రంగాల్లో 20కి పైగా ఇంక్యుబేటర్లు..
  • తెలంగాణ ప్రభుత్వ కృషి అమోఘం..

హైదరాబాద్ : దేశంలో స్టార్టప్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్‌ను ఏర్పాటు చేసింది. ఇది.. దేశంలోనే అత్యుత్తమ ఆవిష్కరణ వ్యవస్థను తెచ్చింది. ఫలితంగా ఇప్పుడు స్టార్టప్‌లకు స్వర్గధామంగా రాష్ట్రం మారింది.

2016లోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్‌ పాలసీని రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. కేవలం ఐటీ రంగంలోనే కాకుండా ఔషధ, బయో, మెడికల్‌, వ్యవసాయ, మహిళ, సామాజిక అంశాల్లో ప్రత్యేకంగా స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా వేర్వేరు ప్రాంతాల్లో ఇంక్యుబేటర్‌లను ఏర్పాటు చేయించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 20కిపైగా ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. తెలంగాణలో శరవేగంగా స్టార్టప్‌ ఎకోసిస్టం మెరుగుపడటానికి ఇక్కడి నైపుణ్యం కలిగిన మానవ వనరులూ కారణమే. స్టార్టప్‌లకు ఫండింగ్‌ చేసేందుకు ఎంతోమంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతుండటం కూడా కలిసొస్తున్నది. ఐటీ రంగంలో ఎంతో ప్రగతి సాధించినట్టే స్టార్టప్‌ ఎకోసిస్టం అభివృద్ధిలోనూ తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు