Sunday, September 8, 2024
spot_img

గోల్నాక డివిజన్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ఎన్నికల ప్రచార పాదయాత్రకు భారీ మద్దతు

తప్పక చదవండి

హైదరాబాద్ : శనివారం రోజు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని అన్నపూర్ణ నగర్, దుర్గా నగర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ను వివరించి, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో, అంబర్ పేటలోని దాదాపు ప్రతి ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఏర్పాటు చేశామని, కలుషిత మంచి నీటి సమస్యను పరిష్కరించామని, త్రాగు నీటి కొరత లేకుండా చేయడమే కాకుండా పరిశుభ్రతను మెరుగుపరిచామని, అలాగే సంక్షేమం విషయంలోనూ ప్రజలకు అండగా నిలిచి ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ మొదలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు