Sunday, September 8, 2024
spot_img

తెలంగాణలో భారీ వర్షాలు

తప్పక చదవండి
  • హెచ్చరించిన వాతావరణ శాఖ

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలో విూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. భూపాలపల్లి, జయశంకర్‌, ములుగు, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించింది.కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కూరుస్తాయని చెప్పింది. వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని గంటకు 40 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడిరచింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు