Sunday, September 8, 2024
spot_img

బాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

తప్పక చదవండి
  • 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసిన హైకోర్టు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు బెయిల్‌ దాఖలు చేయగా.. విచారణను ఈ నెల 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా పిటిషన్‌పై కౌంటర్‌ను దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. గత 33 రోజులుగా ఆయన సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంటూ వస్తున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో పలు కేసులు విచారణకు రానున్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ కోసం చంద్రబాబు తరఫున న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే అంగళ్లకు సంబంధించిన కేసు ముందస్తు బెయిల్‌పై విచారణ జరుగనున్నది. అదే సమయంలో ఫైబర్‌నెట్‌ కేసులో సీఐటీ పీటీ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వారెంట్‌పై విచారణకు ఏసీబీ కోర్టు సమ్మతించింది. దీనిపై మధ్యాహ్నం కోర్టు వాదనలు విననున్నది. ఆ తర్వాత తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు