Sunday, September 8, 2024
spot_img

ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి

తప్పక చదవండి
  • 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
  • ఆమె మృతికి గ్రూప్-2 వాయిదా కారణం కాదా?
  • పోలీసులు ఏం చెబుతున్నారంటే..

ప్రవళిక సూసైడ్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రవళిక మృతి ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ సెక్రటరీని ఆదేశించారు గవర్నర్. ప్రవళిక మృతిపై కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. మరోవైపు ఈ ఘటన తనను బాధించిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రవళికది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపించారు. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిల్లాడుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే జాబ్ క్యాలెండర్ వస్తుందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కాగా గ్రూప్ -2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సూసైడ్ నోట్ రాసి మరీ హాస్టల్ గదిలో ఆమె ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. శుక్రవారం రాత్రి అశోక్ నగర్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయటం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఆమె మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు మళ్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సైతం దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి బాధ కలిగించిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలను పదేపదే వాయిదా వేయటం వల్లే ప్రవళిక తన జీవితాన్ని అంతం చేసుకుందని ఖర్గే ట్వీట్ చేశారు. ఇలా ఈ ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఆమె మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె మృతిపై చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి చెప్పినట్లుగా ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియుడు మోసం చేయడం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని.. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ఆమె ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఏసీపీ యాదగిరి అన్నట్లుగా ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. గ్రూప్ 2 కోణాన్ని ప్రేరేపించిన నిరసనకారులపై చర్య తీసుకుంటామని ఆయన చెప్పినట్లు ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుతోంది. అయితే ఈ ఘటనపై పోలీసు అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపడితే కానీ అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు