Sunday, September 8, 2024
spot_img

ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలి..

తప్పక చదవండి
  • ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలి.
  • ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్.కళ్యాణ్

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఏబీవీపీ కోఠి జిల్లా కన్వీనర్ సభావట్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కల్పించి, టీచింగ్ నాన్ టెస్టింగ్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన పాఠశాలలు, కళాశాలలో సకాలంలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేయాలి. వాటితోపాటు మంచినీటి వసతి, మరుగుదొడ్లు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా సామగ్రి తదితర వాటిని కల్పించాలన్నారు. ప్రతి పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చూడాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటీవల విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయని, అనుమతులు లేని పాఠశాలలను వెంటనే మూయించాలన్నారు. కొందరు ప్రైవేటు పాఠశాల కళాశాల యజమాన్యాలు విద్యార్థుల నుండి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. ఆలాంటి పాఠశాల కళాశాల యజమాన్యాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్య పూరిత వైఖరి వీడి నిరుపేద విద్యార్థులకు తగిన న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు