Sunday, September 8, 2024
spot_img

బంగారు చిరుత(ల్లు)లు

తప్పక చదవండి

ఎల్‌.బి.నగర్‌ : ‘‘స్పర్ధాయ వర్ధతే విద్యా’’ అనే నానుడి ఎప్పుడో మన పెద్దలు చెప్పారు. విద్యలో పోటీ పడటమనేది ఆరోగ్యకరం అవసరమూను. ఆ పోటీ మనతో మనమే అయ్యుండడం మరింత గొప్ప విషయం ఇప్పుడు మీకు ఓ ఇద్దరు అక్క చెల్లెళ్ళను మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రతిభలో ఇద్దరూ ఇద్దరే, ప్రావీణ్యంలో ఇద్దరికీ ఇద్దరే, ఒక్కొక్కరు ఎంచుకున్న మార్గం వేరైనా లక్ష్యం ఒకటే. అక్క రంగ సంజన, చెల్లి రంగ సాన్విక. పాఠశాలలో ఉత్తమ విద్యార్థినులుగా ఇంట్లో అమ్మ కూచీలుగా తోటి విద్యార్థులతో ప్రత్యేక ప్రతిభ కలిగిన విద్యార్థులుగా, బహుళ ప్రగతితో చిన్నారులు ఇద్దరు దూసుకుపోతున్నారు. 2023 సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విజయవాడకు చెందిన విశ్వకర్మ సేవా ట్రస్ట్‌ వారు హైదరాబాద్‌ లోని ఎల్‌.బి.నగర్‌ బ్రాంచ్‌, అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థినులైన రంగ సంజన (8వ తరగతి ) రంగ సాన్విక (3వ తరగతి)ల ప్రతిభను గుర్తించి వారికి స్వర్ణ నంది పురస్కారాలను ప్రధానం చేశారు. రంగ సంజన ఆక్రిలిక్‌ కలర్స్‌ తో 150 కి పైగా పెయింటింగ్స్‌ చిత్రించి తన కుంచెతో అద్భుతాలు సృష్టిస్తుంటే, చిరు ప్రాయంలోనే రంగ సాన్విక చిన్న చిన్న సాంకేతిక అంశాలతో కూడిన ప్రయోగాత్మక వస్తువులను వేగంగా తయారు చేస్తూ విమర్శలు సైతం విస్తుపోయేలా నిరూపించుకుంటూ వుంది. ఇదే స్కూల్‌ నుండీ ప్రిన్సిపాల్‌ సివిఎస్‌ఎస్‌ రమణి, టీచర్‌ మాధవరం సూర్య అర్చనలకూ జాతీయ స్వర్ణ నంది పురస్కారాలను అందజేశారు. విద్యార్థులలో దాగి వుండే సృజనాత్మకతను బయటకు తీసి వారికి మంచి ప్రోత్సాహం అందించడమే కాకుండా చిన్న వయసులోనే ఉత్తమ ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దడంలో అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌ బోధనా సిబ్బందిగా రంగ సిస్టర్స్‌ ప్రగతిలో వీరి కాంట్రిబ్యూషన్‌ కాదనలేనిది. ఇదంతా ఒక ఎత్తైతే రంగ సిస్టర్స్‌ సాధించిన విజయాన్ని స్కూల్‌ అసెంబ్లీలో విద్యార్థులు అందరి ముందు మరోసారి స్కూల్‌ సీఈవో మదన్‌ మోహన్‌ రావు చేతుల మీదుగా స్వీకరించడం నిజంగా ఆ చిన్నారుల మన స్సుల్లో మరచి పోలేని మధుర జ్ఞాపకమే అవుతుంది. ఈ సందర్భంగా అ క్షర ఇంట ర్నేష నల్‌ స్కూల్‌ సీఈవో మదన్‌ మోహన్‌ రావు మాట్లా డుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడంలో టీచర్‌ ప్రిన్సిపల్‌ చూపించిన చొరవకు ముందుగా వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థుల మాతృమూర్తి రంగ ప్రసన్న తోడ్పాటు ప్రోత్సాహం పిల్లల్లో మరింత ధైర్యం నింపిందని తెలియజేశారు స్పోర్ట్స్‌ ఇతర ఎక్స్ట్రా కరికులం సంబంధించిన ఆర్ట్స్‌ ను ప్రోత్సహించడంలో అక్షరా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. ఇటువంటి విద్యార్థులకు అన్ని రకాలుగా అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సిబ్బంది అండగా ఉంటుందని తెలియజేశారు.

రంగ సంజన రంగసాన్విక ఇద్దరు వారికి నచ్చిన అంశాలలో తిరుగులేని ప్రతిభను చూపిస్తూ ఇతర విద్యార్థులకు కూడా మోడల్గా నిలిచారని అభినందించారు ఇదే సమయంలో పెయింటింగ్స్‌ వేస్తున్న రంగ సంజనకు తరచిత్రం గీయాల్సిందిగా కోరారు రంగసాన్విక అకాడమిక్స్‌ లో మంచి ప్రతిభ చూపిస్తూనే వారంలో ఒక కొత్త అంశంతో తయారుచేసిన ఎలక్ట్రానిక్‌ ఇన్నోవేటివ్స్‌ తో క్లాస్‌ పిల్లలందరినీ టీచర్లను ఆశ్చర్యపరు స్తుంటారు ఈ రకంగా చిన్నారులు ఉన్న ప్రతిభను ప్రోత్సహించడంలో వారి పేరెంట్స్‌ తో పాటు స్కూలు సిబ్బంది యాజమాన్యం విద్యార్థులు అందరూ తోడుంటారని ఆయన తెలియజేశారు ఇంటర్నల్‌ గా స్కూల్లో జరిగే పోటీల్లో విద్యార్థులు అనేక రకాల బహుమతులను ప్రోత్సాహకాలను ఆదుకుంటారని, వీటితోపాటు బయట జరిగే పోటీలలో కూడా ఇలా పురస్కారాలు గెలుచుకున్న విద్యార్థులకు స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేయడం వారిని ప్రోత్సహించడం జరుగుతుందని సీఈఓ మదన్‌ మోహన్‌ రావు వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు