Sunday, September 8, 2024
spot_img

ధవళేశ్వరం దగ్గర పెరిగిన వరద..

తప్పక చదవండి
  • ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉధృతి ఏపీలోని ధవళేశ్వరం
  • బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది.
    అమరావతి : ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగి రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద ప్రవాహం మాత్రం గోదావరిలో కొనసాగుతుంది.
    మరోవైపు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ వైపు వస్తుండడంతో బ్యారేజీ వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరింది. 17.75 అడుగులకు నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. బ్యారేజీ నుంచి 16.20లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
    వరద ఉధృతి పెరగడం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాలల్లో పలు గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కోనసిమ జిల్లా పరిధిలోని నదీ పరీవాహక లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు