Sunday, September 8, 2024
spot_img

ఢిల్లీ లో తన మొదటి ఆఫ్‌లైన్‌

తప్పక చదవండి
  • ఇఎస్‌సి, గేట్‌, ఎస్‌ఇఎస్‌ సెంటర్‌ ప్రారంభం
  • దేని ద్వారా రానున్న 5 ఏళ్లలో 12 నగరాల్లో విస్తరణ ప్రణాళికను చేపట్టిన ఫిజిక్స్‌ వాలా..

న్యూఢిల్లీ : ఈ కేంద్రం అందిస్తున్న రెండు ప్రత్యేక కోర్సులలో ఈ.ఎస్‌.ఈ. గేట్‌, ఎస్‌.ఈ.ఎస్‌.- 2025 1-ఏడాది ఫౌండేషన్‌ కోర్సు మరియు ఈ.ఎస్‌.ఈ. ప్లస్‌, గేట్‌. ఎస్‌.ఈ.ఎస్‌ 2025 1 ఏడాది ఫౌండేషన్‌ కోర్సు ఉన్నాయి. భారతదేశంలోని ప్రముఖ ఎడ్‌-టెక్‌ ప్లాట్‌ఫారమ్‌ ఫిజిక్స్‌ వాలా, పోటీ పరీక్షల శిక్షణ విధానాన్ని మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. తన కేంద్రాల విసక్తరణ విస్తరణలో భాగంగా, కంపెనీ తన మొట్టమొదటి ఆఫ్‌లైన్‌ ఈ.ఎస్‌.ఈ., గేట్‌, ఎస్‌.ఈ.ఎస్‌. (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌) కేంద్రాన్ని ఢల్లీిలోని సాకేత్‌లో ప్రారంభించింది. యూపీఎస్‌సి నుంచి సీడీఎస్‌, ఎస్‌ఎస్‌సి లతో పాటు వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేస్తూ, ఫిజిక్స్‌ వాలా తనదైన గుర్తింపు దక్కించుకుంది. సాకేత్‌లో కేంద్రాన్ని ప్రారంభించిన ఫిజిక్స్‌ వాలా ఇప్పుడు ఇంజినీరింగ్‌ ఆశావాహులకు అత్యంత డిమాండ్‌ ఉన్న పరీక్ష ఈ.ఎస్‌.ఈ. గేట్‌, ఎస్‌.ఈ.ఎస్‌. లలో విజయం సాధించాలని కోరుకునే అభ్యర్థుల కలలను సాకారం చేసేందుకు తన పరిధిని విస్తరిస్తోంది. ఇంజినీరింగ్‌ ఔత్సాహికులు రాణించేందుకు సాకేత్‌ సెంటర్‌లో ఫిజిక్స్‌ వాలా రెండు ప్రత్యేక కోర్సులను ప్రవేశపెడుతోంది..
గేట్‌ 2025 1-ఏడాది ఫౌండేషన్‌ కోర్సు: రాబోయే ఏడాదికి సిద్ధమవుతున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులకు బలమైన పునాదిని అందించేలా ఈ కోర్సును రూపొందించారు. ఈ.ఎస్‌.ఈ. గేట్‌, ఎస్‌.ఈ.ఎస్‌. 2025 1-ఏడాది ఫౌండేషన్‌ కోర్సు: 2025లో ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, గేట్‌, ఎస్‌.ఈ.ఎస్‌.లో రాణించాలని ఆకాంక్షించే వారి కోసం ఈ కోర్సును రూపొందించారు. ఈ కోర్సులకు అడ్మిషన్‌ సెప్టెంబరు 25 నుంచి, తరగతులు డిసెంబర్‌ 15 నుంచి పారంభం అవుతున్నాయి. సాకేత్‌ సెంటర్‌ అధికారికంగా నవంబర్‌ 15న ప్రారంభమ వుతుంది. అభ్యర్థులు నామమాత్రపు రిజిస్ట్రేషన్‌ రుసుము రూ.5000 చెల్లించి ఫిజిక్స్‌ వాలా యాప్‌ ద్వారా తమ కేంద్రాలను రిజర్వు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏకాగ్రత, లీనమయ్యే అభ్యాస వాతావరణాన్ని అందించేందుకు కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. ఫిజిక్స్‌ వాలా సమగ్ర ఈ.ఎస్‌.ఈ. గేట్‌, ఎస్‌.ఈ.ఎస్‌. పరీక్షలకు తయారీ, వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం, అత్యాధునిక విద్యా వనరులను అందిస్తూ, విద్యార్థులను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అలా చేయడం ద్వారా, ఈ విద్యార్థులు టాప్‌ స్కోర్‌లను సాధించేందుకు, ఇంజినీరింగ్‌ రంగంలో ఆశాజనకమైన భవిష్యత్తును పొందేలా తీర్చిదిద్దాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు