Sunday, September 8, 2024
spot_img

ఎన్నికలలో గెలుపే మన లక్ష్యం కావాలి..

తప్పక చదవండి

అద్భుతమైన సూచనలు చేసిన ” దేవముని దైవ దైవజ్ఞ “, శ్రీ రుద్రపీఠం..

హైదరాబాద్, ఎన్నికలు ఏవైనా కావచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ అన్నియలు, పార్లమెంట్ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైనా ఒక యుద్ధమే.. ఆ యుద్ధంలో గెలిచి తీరాలి. దాని కోసం ఎన్ని పాట్లు అయినా పడాలి. గెలవడమే ముఖ్యం..

- Advertisement -

యుద్దానికి బయలుదేరేముందు అస్త్ర శస్త్రములను సిద్ధం చేసుకుని ఎలా బయలుదేరుతామో..? అలాగే మనం ఎన్నికలు అనే యుద్దానికి బయలుదేరేముందు విజయ ముహూర్తములు, ఇంటి వాస్తు, ఆవీసు వాస్తు సరిదిద్దు కోవడమే కాకుండా యంత్రములు, తంత్రములు, మంత్రములు అనే ఆయుధాలను కూడా వెంటబెట్టుకుని, ఏ అపశకునములు అడ్డుపడకుండా చూసుకొని, ఇంటి దేవుని ఆశీర్వాదమును పంది, ఇష్ట దేవునికి దండము పెట్టుకొని, పితృదేవతలకు పాదాభివందనములు చేసి, రాహుకాలం, కేతుకాలం,యమగండ కాలం, గులికకాలం, దుర్ముహూర్తములలో బయలుదేరాకుండా, కార్యసిద్ధిని ఇచ్చునటువంటి ముహూర్తములు చూసుకొని, బయలుదేరే ముందు తెల్లని గోమాత ఎదురుగా వచ్చునట్లు చూసుకొని బయలుదేరిన ఎంతటి క్లిష్ట, కష్ట కార్యములైననూ వాటిలో విజయము తప్పక లభిస్తుంది.. అంటే యుద్దములో అనగా ఎన్నికలలో విజయదుంధుభిని తప్పక మ్రోగించ గలము..

ఎన్నికలలో గెలుపే మన లక్ష్యం..
ఈ లక్ష్యమును సాధించడానికి మనలో సంపూర్ణమైన ఆకర్షణ తంత్రములను వుపయోగించి సమ్మోహణ బాణములను జన సమూహములపై విసిరి వారందరిని మనవైపు ఆకర్షించుకుని సమ్మోహనపరిచి ఎన్నికలలో విజయం పొందునట్లు చేసుకొనవలెను.. దానికోసం సమ్మోహన సూర్య మంత్రమును, శ్రీకృషుని బీజాక్షర మంత్రమును, కామదేవుని మంత్రమును, కామగాయత్రి మంత్రమును ఇలా సమ్మోహనమునకు సంబంధించిన మంత్రములను, సర్వజన ఆకర్షణ వశీకరణ మోహనలకు సంబంధించిన మంత్ర తంత్ర యంత్రములనే కాకుండా సమ్మోహన తిలకములను, సెంటులను కూడా ధరించి జనులను సమ్మోహితులను చేసుకొని విజయమును పొందవలెను.. గెలుపే లక్ష్యముగా చేసుకుని ఎన్నికలనే యుద్దములోనికి బయలుదేరునపుడు స్థంభన, ఉచ్చాటన, విద్వేషణలే కాకుండా ఆకర్షణ, వశీకరణ ప్రయోగములను కూడా ఉపయోగించుకొని విజయులై విజయమును సాధించి సుఖ భోగ ఐశ్వర్య సంతోషాలతో ఉండగలరని ఆశిస్తూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు ” దేవముని దైవ దైవజ్ఞ “, శ్రీ రుద్రపీఠం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు