Sunday, September 8, 2024
spot_img

ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి

తప్పక చదవండి
  • ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై యూనిట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన డీజీపీ అంజనీ కుమార్‌
  • తమ అనుభవాలను వివరించిన కర్ణాటక ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన అధికారులు

హైదరాబాద్‌ : ఎన్నికల నిర్వహణ అనేది ప్రతీ అధికారికి నిత్య నూతనంగానే ఉంటుందని, ఎన్నికల నిర్వహణలో ప్రతీసారి సరికొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయని డీజీపీ అంజనీ కుమార్‌ పేర్కొన్నారు. మరో 5 ,6 నెలల్లో రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలకు పరిపాలనా పరమైన ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఎన్నికల సంబంధిత నేరాల పాత కేసులు వంటి సమస్యలు తదితర అంశాలపై రాష్ట్రంలోని అందరు పోలీస్‌ కమీషనర్లు, ఎస్‌.పి.లకు నేడు డీజీపీ అంజనీ కుమార్‌ పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన శాసన సభ ఎన్నికలకు కేంద్ర ఎన్ని కల సంఘం ద్వారా శాంతి, భద్రతల పరిశీలకులుగా వెళ్లిన అడ షినల్‌ డీజీ సౌమ్యా మిశ్రా, పోలీస్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం డీసీపీ అభిషేక్‌ మొ హంతిలు అక్కడి తమ అనుభవాలను, ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతల పరిరక్షణకై చేపట్టాల్సిన జాగ్రత్తలను నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ, శాసన సభ ఎన్నికలకు మరో 5 ,6 నెలలు న్నప్పటికీ ఈ జూన్‌, జూలై మాసాల్లో చేయాల్సిన ప్రణాళికలతో పాటు ఎన్నికలకు సంబంధించి బందోబస్త్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, సిబ్బంది డిప్లాయ్‌ మెంట్‌, కేంద్ర బలగాలతో సమన్వయం తదితర అన్ని అంశాలపై స్పష్టత కలిగి ఉండాలని యూనిట్‌ అధికారులకు సూచించారు. ప్రస్తుత యూనిట్‌ అధికారుల్లో చాలామంది కొత్తగా ఉన్న అధికారులు న్నందున, గతంలో ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న ప్రతీ స్థాయి పోలీస్‌ అధికారి సహకారం తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా కర్ణాటక ఎన్నికలకు పరిశీలకులుగా వెళ్లి వచ్చిన అడిషనల్‌ డీజీ సౌమ్యా మిశ్రా, డీసీపీ అభిషేక్‌ మొహంతిలు అక్కడి ఎన్నికల నిర్వహణలోని అనుభవాలను వివరించారు. ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర, దీనిలో ప్రధానంగా జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక రూపొందించడం, జిల్లా సెక్యూరిటీ, భద్రతా దళాల డిప్లాయ్‌ మెంట్‌, నామినేషన్‌ పత్రాల దాఖలు నుండి ప్రచార పర్వం, పోలింగ్‌ రోజు నిర్వహణ తదితర అంశా లపై చేపట్టాల్సిన ప్రణాళికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల విషయంలో శాంతి భద్రతల పరంగా చేయాల్సిన ముం దస్తు జాగ్రత్తలు, ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, తీవ్రవాద ప్రాభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలు, ఎన్ని కల ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్‌ రోజున, ఈవీఎం తరలింపు, కౌంటింగ్‌ రోజున చేయాల్సిన ప్రత్యేక బందోబస్తు తదితర అంశాలపై అడిషనల్‌ డీజీ సౌమ్యా మిశ్రా సవివరమైన ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఇంటలిజెన్స్‌ విభాగం అడిషనల్‌ డీజీ అనీల్‌ కుమార్‌ మాట్లాడుతూ, ఎన్నికలను జరిగే ప్రాంతాల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ పోలీస్‌ అధికారిని తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ఇప్పటినుండే తగు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని సూచించారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, సరిహద్దు ప్రాంతాల చెక్‌ పోస్ట్‌ ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. సీఐడీ విభాగం అడిషనల్‌ డీజీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ, ప్రతీ పోలీస్‌ స్టేషన్లో ఒక గైడ్‌ పోలీస్‌ ను ఎంపిక చేయాల్సి ఉంటుందని, ఈ గైడ్‌ పోలీస్‌ అధికారి కేంద్ర బలగాలకు ఉపయోగకరంగా ఉంటారని అన్నారు. ఒకసారి ఎన్నికల ప్రకటన వస్తే ఏవిధమైన బదిలీలు జరుపవద్దని తెలియచేసారు. ఎన్నికల ప్రకటనకు ముందుగానే అన్ని బదిలీలు జరుపాలని తెలిపారు. తెలంగాణా పోలీస్‌ బెటాలియన్స్‌ అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రానికి వచ్చే కేంద్ర పారా మిలటరీ దళాల మోహరింపు తదితర అంశాల పర్యవేక్షణకై ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ తెరవడం జరుగుతుందని వెల్లడిరచారు. అడిషనల్‌ డీజీ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం శిక్షణలో ఉన్న ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుల్స్‌ సేవలను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. ఐజి షానవాజ్‌ కాసీం మాట్లాడుతూ.. గత ఎన్నికల సందర్బంగా అమలు చేసిన గుడ్‌ ప్రాక్టీసెస్‌ (ఉత్తమ చర్యలు)ను అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ఆరునెలల ముందే ఈ విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వల్ల ఎన్నికల నిర్వహణ మరింత సులభతరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఇంటలిజెన్స్‌ విభా గం డీఐజీ కార్తికేయ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కై సూక్ష్మ స్థాయి ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రధానంగా, క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలు, వల్నరబుల్‌ పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు