Sunday, September 8, 2024
spot_img

మాదక ద్రవ్యాల వాడకం.. ప్రమాదకరమైన వ్యసనం

తప్పక చదవండి
  • దొంతాన్‌పల్లి ఐసీఎఫ్‌ఏఐ యూనివర్సిటీలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

శంకర్‌ పల్లి : శంకర్‌ పల్లి మండలం దొంతాన్‌ పల్లి పరిధిలోని ఇక్ఫాయ్‌ యునివర్సిటీలో డ్రగ్స్‌ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా రాజేంద్రనగర్‌ డిసిపీ జగధీశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ…దేశంలో సగానికిపైగా వున్న యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. వీరిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ.. వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. దీనివల్ల సమాజమూ, కుటుంబము తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడుతోంది. సమాజంలో చోటుచేసుకుంటున్న సకల అనర్థాలకు, అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు మత్తే ప్రధాన కారణం అని అనేక సర్వేలు చెబుతున్నాయి. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, యువతను అరాచకత్వం వైపుకు నెడుతున్న డ్రగ్స్‌ నుంచి వారిని దూరం చేయాలి.డ్రగ్స్‌ రహిత సమాజ రూపకల్పనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి . ఒకసారి దీనికి బానిసలైన తర్వాత ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి వెనుకాడరు.

ఈ మత్తు మందులు పండిరచేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు, విద్యార్థులు ఇలాంటి చెడు అలవాట్ల కు బానిస లు కాకుండా తమ చదువు పైన దృష్టి పెట్టాలని అన్నారు.ఏడాదిలో ఒకరోజు డ్రగ్స్‌ వ్యతిరేక దినోత్సవం జరుపుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. ఆచరణలో నిర్దేశిత లక్ష్యాలకు కట్టుబడి వుండాలి. డ్రగ్స్‌ మహమ్మారిని పారదోలి… చైతన్యవంతమైన సమసమాజ స్థాపనకు,డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఐసిఎఫ్‌ఏఐ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ డా’’ ఎల్‌ ఎస్‌ గణేష్‌ , యూనివర్సిటీ రిజిస్టారర్‌ డా ‘‘ విజయ లక్ష్మి, రాజేంద్రనగర్‌ డి సి పి జగధీశ్వర్‌ రెడ్డి, అడిషనల్‌ డిసిపి రష్మి పెరుమాళ్‌, ఐపిఎస్‌ సునీత రెడ్డి,స్పెషల్‌ యాంటి నార్కోటిక్స్‌ బ్యూరో జి.చక్రవర్తి, స్పెషల్‌ యాంటి నార్కోటిక్స్‌ బ్యూరో కు చెందిన డిఎస్పిలు కె.నర్సింగ్‌ రావు, శివనాయుడు, హరి చంద్రా రెడ్డి, నార్సింగి ఏసిపి లక్ష్మీనారాయణ, మోకిలా ఇన్స్పెక్టర్‌ పి.నరేష్‌ , మోకిలా డిటెక్టివ్‌ ఇన్స్పెక్టర్‌ ఏ.నాగరాజు, మరియు పోలీస్‌ సిబ్బంది కాలేజి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు