Sunday, September 8, 2024
spot_img

దళితులను ముంచుడు.. బీసీలను తొక్కుడు..!

తప్పక చదవండి
  • అబద్దాలకు అంతం లేదు అప్పులకు లెక్కలేదు దటీజ్‌ కేసీఆర్‌
  • చెప్పేది బారేడు.. చేసేది జానడు.. ఇక ఆపు నీ జుటా మాటలు
  • మాయ మాటలు.. గారడి మాటలతో బురిడీ
  • నీవు నేర్పిన విద్య, నీకే అప్పజెప్పే రోజు హాసన్నమైంది
  • ఉద్యమ ద్రోహులను అందలమెక్కించిన ఘనత నీకే
  • కరువైన హామీలు.. అసెంబ్లీలో మాటమార్చిన తీరు
  • రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత నీదే దొర..
  • నోటిఫికేషన్ల పేరుతో ఫీజులు.. కానరానీ కొలువులు

ఉద్యమ సమయంలో కేసీఆర్‌ రేచ్చ కొట్టుడు ప్రసంగాలకు తెలంగాణ ప్రజలు ఆకర్షితులై ఉద్యమంలో ఎంతోమంది యువకులు అమరులైనారు. అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి దళితున్నే చేస్తానని ఎన్నోసార్లు బహిరంగ సభలలో ప్రకటించిన కేసీఆర్‌ తెలంగాణ సిద్ధించి రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు నీటి మూట లేనా ఇచ్చిన హామీలు ఒకటైన నిలబెట్టుకున్నావా దొర.. తెలంగాణ ప్రజలని సీఎం కేసీఆర్‌ మోసం చేసిన కొన్ని నిజాలు ఆదాబ్‌ పాఠకుల కోసం…

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి.. మాట తప్పడంలో ఆయనను మించిన వారు మరెవ్వరు లేరు.. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే.. నేను కాపలా కుక్కలెక్క ఉంట.. కేసీఆర్‌ మాట ఇచ్చిండంటే తల నరుక్కుంటడుగానీ తప్పడు.. 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన స్పష్టమైన హామీ. ఈ హామీని నమ్మిన దళితులు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (అప్పుడు టీఆర్‌ఎస్‌)కు అండగా నిలిచారు. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది.. దళిత సీఎం హామీని మరిచాడు తానే ముఖ్యమంత్రి అయ్యాడు.. తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరికి మూడెకరాల భూమిని పంపిణీ చేస్తానని నిండు సభల్లో చెప్పిన సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నేను ఆ మాట అనలేదని మాట మార్చాడు.. సభలో మాట్లాడిన వీడియోలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజలు ఇప్పటికి ట్రోలింగ్‌ చేస్తున్నారు. మూడు ఎకరాల భూమి ఇస్తా తొలి ఏడాది దానికి అయ్యే లాగోడి ఇస్తా అన్న కేసీఆర్ ఎటుపాయే, తెలంగాణలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యా అని హామీ ఇచ్చి, పదేళ్లు గడిచిన ఇప్పటివరకు అది ఏడ వేసిన గొంగడి ఆడనే ఉంది. నీ మనుమడు నా మనుమడు ఒకే పాఠశాలలో చదవాలంటివి.. మరి నీ మనవడు ఏమో అమెరికాలో చదువుతుంటే, మరి మా బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రం చదువుకు దూరం కావాలా అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దళితులకు మూడెకరాలు లేవు.. దళిత బంద్‌ సాయము లేదు.. కేవలం మీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దగ్గర చెంచాగిరి చేసే వారికి మాత్రమే దళిత బంధు సాయం ఇచ్చుకున్నారు. తెలంగాణ రాకముందు ఇంటికో ఉద్యోగం అంటివి.. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆ మాట నేను అనలేదు అంటివి.. నీది నోరా మోరా అంటూ అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలను యువతను మహిళలను మోసం చేసిన ఘనత నీకే దక్కుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు ప్రవేశపెట్టిన మొగోడ్ని నేనే అంటివి.. రైతుబంధు ద్వారా ఎవరు బాగుపడుతున్నారో తెలుసా..! రైతుబంధు సాయం పేద రైతులకు దక్కాలి కానీ, నీపక్కన ఉండి భజన చేసే భజన భక్తులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నీ అనునయులకు వేలాది ఎకరాలకు రైతుబంధు ఇచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత నీదే కదదొర..! రైతుబంధు అంటే రైస్‌ మిల్లులకు, ఔటర్‌ రింగ్‌ రోడ్లకు, పెట్రోల్‌ పంపు లకు, షాదీ ఖానాలకు, రకాల గోదాములకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడమేనా నీవు ప్రవేశపెట్టిన అద్భుతమైన రైతు బంధు పథకం అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నీ పాలనలో అంతులేని అవినీతి జరుగుతుందని నీకు తెలియదా! నిరుద్యోగ భృతి ఏమైందని యువత అడుగుతున్నారు.. 2018 ఎన్నికలకు ముందు చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ. 3,016 భృతి ఇస్తానంటివి.. ఐదు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చక పోతివి ఇదేనా బంగారు తెలంగాణ నిరుద్యోగులు దుమ్మెత్తి పోస్తున్నారు. తెలంగాణ రైతులకు 2016లో ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ ఏమైందని రైతులు అడుగుతున్నారు. దొర ఎంతనండి 25లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నులు ఇదో లెక్కన మనకు కేసీఆర్‌ తలుచుకుంటే అది ఇవ్వలేడా అని పొంగనాలు కొడితివి దొర నీ ఉచిత ఎరువుల హామీఏది అంటూ రైతులు అడుగుతున్నారు.

- Advertisement -

నోటిఫికేషన్లు వేయడం.. అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయడం
రాష్ట్రంలో లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ఉద్దెర మాటలు చెప్పి నిరుద్యోగులను ముంచిన ఘనత కేసీఆర్‌ది . నోటిఫికేషన్లు వేయడం.. అడ్మిషన్‌ ఫీజు వసూలు చేయడం తప్ప ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గ్రూప్స్‌ అని అంటాడు కానిస్టేబుల్‌ కొలువులు అంటాడు.. టీచర్ల భర్తీ అంటాడు.. వాటి పేరుతో ఉద్యోగ నోటిఫికేషన్‌ వేయడం, వాటి ద్వారా ఫీజు రూపంలో వేల కోట్లు దండుకోవడం తప్ప నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు. రోజురోజుకు నిరుద్యోగులు ఉత్సాహం తగ్గిపోయి వయసు అయిపోయి డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యలు చేసుకోవడం లేదా మద్యానికి బానిసలు అవడం తప్పితే తెలంగాణలో ఇంకేముంది. ఈయన ప్రజా రంజక పాలనలో నిరుద్యోగులు బలయ్యారు, ప్రమోషన్లు బదిలీలు లేక ఉద్యోగులు బలయ్యారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి తారీకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.

పత్తాలేని హామీలు..
సారు వారి ఏలుబడిలో ఇప్పటివరకు కొత్త రేషన్‌ కార్డులు రాలేదు. ఎంతోమందికి పెళ్లిఅయి పది సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇప్పటివరకు డబల్‌ బెడ్‌ రూమ్‌, ఒంటరి మహిళల పెన్షన్‌, నిరుద్యోగ భృతి రాక గోసలు పడుతున్నారు. ఎన్నికలకు ముందు మీరు ఎన్ని అప్లికేషన్లు ఇస్తే అన్ని రేషన్‌ కార్డులు, పెన్షన్‌లు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నామని ఉదరగొట్టే ముఖ్యమంత్రి ఏమైపోతివి..

రాష్ట్రంలో ఆగని ఆత్మహత్యలు,, అరచకాలు..
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రౌడీలుగా గుండాలుగా మారిండ్రని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు చేసి అరాచకాలను అన్యాయాన్ని ఎదిరిస్తే వారిపై అక్రమ కేసులు మోపి ఇబ్బందులకు గురి చేయడం తప్పితే న్యాయం ఎక్కడైనా దొరికిందా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం చలనం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు