Sunday, September 8, 2024
spot_img

నోట్లకు ఓట్లను అమ్ముకోవద్ధు

తప్పక చదవండి

భారత దేశం బ్రిటిష్‌ పాలన నుండి విముక్తి పొందిన తర్వాత జాతీయ నాయకులు దేశ పరిస్థితులను దృష్టిలో వుంచకొని ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంపిక చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు పునాది. ఎన్నికల కమిషన్‌ ఏర్పడి 60 సం’’రాలైన సందర్బంగా ఎన్నికల కమిషన్‌ 2023 జనవరి 25న దేశంలో 12వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తుంది.ఓటు హక్క’ ఓటు విలువ ‘ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన చైతన్యం కలిగిం చి ఓటర్లతో సదస్సులు ర్యాలీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఈ ఏడాది ‘‘బలమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల అక్షరాస్యత ‘‘అనే నినాదం తో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తుంది. భారత్‌ రాజ్యాంగం 326 ప్రకారం 18 సం’’రాలు నిండిన జాతీయ పౌరులకు వయోజన ఓటుహక్కు కల్పించబడిరది. కుల ‘మత ‘ లింగ ప్రాంత ‘ధనిక’ పేద వివక్ష లేకుండా అక్షరాస్యులకు నిరక్షరాస్యులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కుకలిపించి ప్రపంచ రాజకియ చరిత్రలో గొప్ప విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. అభివృధి చెందిన దేశాల కంటె ముందే మన దేశంలో వయోజన ఓటింగ్‌ హక్కు కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. ఓటు హక్కు అందరికీ వజ్రా యుధం అయింది. సామాన్యుని గొంతుకైంది .ఓటు హక్కు ద్వారా ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు కలిగి ఉన్నాడు. తమకు నచ్చిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అధికారం వుంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో సార్వ బౌమాధికారం అధికారం వుంటుంది.ఓటు హక్కు ద్వారా 5 ఏళ్ళకు ఒక సారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ సార్వ భౌమాధికారాన్ని వినియోగిస్తారు. ప్రజలే ప్రభువులు అమెరికా మాజీ అధ్యక్షులు ‘‘అబ్రహం లింకన్‌’’ అభిప్రాయం ప్రకారం ‘‘ ప్రజలచేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రజల ప్రభుత్వం’’ ప్రజాస్వామ్యం అని నిర్వచించారు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటే పునాది. ఎన్నికల కమిషన్‌.. ఎన్నికల కమిషన్‌ స్వతంత్ర ప్రతిపత్తి తో పనిచేస్తూ ఓటరు నమోదు ఓటరు జాబితా తయారు ‘దేశములో చట్టసభల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికల్లో ఓటర్లు అందరు విథిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు నిర్లక్ష్యం.. దేశంలో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 45 శాతం ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించారు.2019 నాటికి17 వ లోకసభ ఎన్నికల్లో67 శాతం మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 90 శాతం ఓటింగ్‌ జరిగితే దేశం అభివృధి పథంలో పురోగమిస్తందన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వ్యాఖ్య ఓటర్లకు కనువిప్పు కావాలి. యువత దేశ భవిత.. దేశ రాజకీయాల్లో యువత క్రియాశీలకంగా పాల్గొనాలి యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.ఓటు వేయడం పై ఆసక్తి చూపడం లేదు. సాధారణ ఎన్నికల్లో యువత ఓటింగ్‌ శాతం గ్రామీణ ప్రాంతాల కంటే తక్కువ వుంటుంది. పట్టణ ప్రాంతాలలో చదువుకున్న వారు ఓటింగ్‌ పై ఆసక్తి చూపడం లేదు. నోటుకు ఓటు ప్రజాస్వామ్యానికి చేటు.. ప్రజా స్వామ్యానికి ఓటు ఆయుధం.. ఓటరు నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించు కోవాలి. కానీ రాజకీయ పార్టీలు ఓటును అంగడి సరుకుగా మార్చాయి .డబ్బు మద్యం వివిధ ప్రలోభాలకు ఓటును అమ్ముకునే నోటుకు ఓటు సంస్కృతి పెరిగి ప్రజాస్వా మ్యానికి చేటుగా పరిణమించింది.రాజకీయ పార్టీలు ఓటర్లకు డబ్బులుఎరగా చూపి ఓటు వేయించు కుంటున్నారు . ఎన్నికల కమిషన్‌ సూచించిన దాని కంటే ఎన్నికల వ్యయం చేస్తున్న రాజ కీయ పార్టీల మీద నియంత్రణ లేదు.ఈ పరిస్థితులు ప్రజాస్వామ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతంగా పరిణమించాయి. ఓటును అమ్ముకో వడం ద్వారా ప్రజలు ప్రజా ప్రతినిదులను ప్రశ్నించే హక్కును కోల్పోతారు. ప్రజాసంక్షేమం కుంటుపడు తుంది. దేశ భవిష్యత్తు నాయకుల చేతుల్లో వుంటుంది. ఆనాయ కుల తలరాత మార్చేది ఓటు’’ కాళోజీ అన్నట్లు ‘‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏ పాటి వాడో చూడాలి’’ ప్రజలకు ఇప్పటివరకు ఏమిచేశాడో గమనించి నేరచరిత లేని నిజాయితీ వంతులను ప్రజా ప్రతినిధులు గా ఎన్నుకొని అవినీతి రహిత’ నేరరహిత రాజకీయ వ్యవస్థకు ఓటర్లు ఉద్యమించాలి. దేశ భవిష్యత్తు అభివృధి ప్రభుత్వాల మార్పుకు ఓటు వజ్రాయుధం లాంటిది. ప్రభుత్వం నిర్బంధ ఓటింగ్‌ విధా నాన్ని అమలు చెయ్యాలి. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారం లో చుయిస్తున్న శ్రధకంటే ఎక్కువగా ఓటింగ్‌ హక్కు వినియోగం ఎన్నికల విధానం ఎన్నికల అక్షరాస్యత మీద దృష్టి పెట్టాలి. రాజకీయ పార్టీలు యువత విభాగం అధ్వర్యంలో ఓటు నమోదు ఓటరు గుర్తింపు ఆధార్‌ కార్డు తో ఓటరు కార్డు అనుసంధానం దొంగ ఓటర్ల గుర్తింపు ఎన్నికల అక్షరాస్యత పరివ్యాప్తికి శిక్షణ తరగతులు నిర్వహించి ఓటింగ్‌ శాతం పెంచడానికి కృషి చెయ్యాలి. ప్రభుత్వం నిర్బంధ ఓటు హక్కును కలిపించాలి. ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ పౌరసమాజం యువత’ మహిళా సంఘాలు’ స్వచ్చంధ ‘సామాజిక సేవా సంస్థలు ఓటు హక్కు వినియోగం పై అవగాహన చైతన్యం కలిగించాలి. కళాశాలల్లో ఓటు హక్కు వినియోగం మీద సాంస్కృ తిక కళా బృందాల ప్రద ర్శనల ద్వారా ఓటర్లను చైతన్య పరచాలి. ‘‘ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా సమర్ధులైన అభ్యర్థులకు ఓటువేసి ఎన్నుకుంటానని ప్రతిజ్ఞ చెయ్యాలి’’ అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బల్లోపేతం అవుతుంది. భారత రాజ్యాంగ పిత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబే ద్కర్‌ చెప్పినట్లు భారత దేశం చారిత్రకంగా వెనుక బడిన వర్గాలు దళితులు ఆదివాసీలు తాడితులు పీడిత వర్గాలు రాజకీ యంగా అభివృధి చెందటానికి ఓటు హక్కు ముఖ్యమైన మార్గం అని పేర్కొ న్నారు. ప్రతి ఓటరు ఓటు విలువ తెలుసుకొని ప్రలో భాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించు కోవాలి. ప్రజా స్వా మ్యాన్ని గౌరవించడం ప్రజల సామాజిక బాధ్యత. ఓటరుగా వున్న ందుకు గర్వపపడుతున్న ఓటు వేయడానికి సిద్దంగా వున్న అనేది నినాదం కాకుండా ఓటర్ల విధానంగా వర్ధిల్లాలి. ఓటు వేద్దాం ప్రజాస్వామ్య పరిపుష్టికి పాటుపడుదాం అని ఓటర్లు ప్రతిజ్ఞ చేయాలి.
` నేదునూరి కనకయ్య 9440245771

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు