Sunday, September 8, 2024
spot_img

సోమవారం దీపావళీ సెలవు

తప్పక చదవండి
  • ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

దీపావళి పండుగకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది అధిక ఆషాడ మాసం రావ‌డంతో పండ‌గ‌ల‌న్నీ కాస్త ఆల‌స్యంగా వ‌స్తున్నాయి. అంతేకాదు తిథుల్లో తేడాతో ప్ర‌తి పండ‌గా ఏ రోజు చేసుకోవాల‌న్న గంద‌రగోళ‌మే. వినాయ‌క‌చ‌వితి, ద‌స‌రా.. ఇప్పుడు దీపావ‌ళికీ అదే ప‌రిస్థితి. దీపావ‌ళి తిథి కూడా రెండు రోజులు రావ‌డంతో పండ‌గ ఏ రోజు, సెల‌వు ఏ రోజు ఇస్తార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం సెల‌వును 12వ తేదీ నుంచి 13వ తేదీకి మార్చింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా సోమ‌వారం దీపావ‌ళి సెల‌వు ప్రకటించింది. ఏపీ ప్ర‌భుత్వం సోమ‌వారం దీపావ‌ళి సెల‌వు ప్ర‌క‌టించింద‌న్న న్యూస్ బ‌య‌టికి రాగానే తెలంగాణ‌లోని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీస్‌లు ఇలా అన్నిచోట్లా ఇదే ట్రెండింగ్ టాపిక్‌ గ మారింది. ఈ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. దీపావళి అంటే.. ఎక్కవగా పిల్లలకు చాలా ఇష్టమైన పండుగ. ఎందుకుంటే.. పిల్లలు పెద్దలు.. అందరు సంతోషంగా టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు