Sunday, September 8, 2024
spot_img

సింగరేణి తెలంగాణ సొత్తు(కాంగ్రెస్ నాయకులవల్లే కేంద్రానికి వాటా)

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ పాలనలో లాభాలు, బోనస్‌లు
  • తుమ్మముల్లు కావాలా…పువ్వాడ పువ్వు కావాలా
  • సమర్థులైన నాయకులను గెలిపించండి
  • గుడ్డిగా, తమాషాగా ఓటు వేయొద్దు
  • కేసీఆర్‌ను చూసి వనమాకు ఓటు వేయండి
  • సీతారామప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసుకుందాం
  • ఖమ్మం జిల్లా చైతన్యాలకు పోరాటాలకు అడ్డా
  • ప్రాంతీయ పార్టీల యుగం రాబోతుంది..
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్

సైకిల్ మీద ప్రతి వాడలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ.. ప్రజలకు ఎంతో చేరువయ్యాడు పువ్వాడ.. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేసిన పువ్వాడను.. ఇంకోసారి గెలిపిస్తే ఖమ్మం ప్రజలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటడు.. పువ్వాడ పువ్వులు కావాలా.. తుమ్మ ముండ్లు కావాలో మీరే నిర్ణయించుకోండి.

కొత్తగూడెం/ఖమ్మం : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడుస్తున్నా దేశరాజకీయాల్లో మాత్రం మార్పు రావడం లేదని, ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చేలా రాజకీయ పార్టీలు తయారయ్యాయని దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద మహా సభను ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం ప్రకాశంస్టేడియం గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన పాల్గని మాట్లాడారు. ఎన్నికలను ప్రజలు తమాషాగా తీసుకోవద్దని, గుడ్డిగా ఎవరికి పడితే వారికి ఓటు వేయవద్దని సూచించారు. సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలని రాష్ట్ర అభివృద్ధి ఒక బీఆర్‌ఎస్‌తో సాధ్యమని బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌ను చూసి కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.వనమా ఎప్పుడు తన సొంత పనుల కోసం తనను అడగలేదని, ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాపత్రయ పడే వ్యక్తి అని కొనియాడారు. తనను ఎప్పుడు కలిసినారోడ్లు, డ్రైన్లు, బ్రిడ్జీలకు నిధులు విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని,మొర్రేడువాగు కోతకు గురై ఇళ్లు కూలిపోతున్నాయని రిటర్నింగ్‌ వాల్‌ కట్టించాలని ఇలా ఎప్పుడూ నియోజకవర్గ బాగుకోసమే అడుగుతుంటారని అటువంటి నాయకుడు ఇక్కడిప్రజలకు దొరకడం ఎంతో అదృష్టమన్నారు. అనునిత్యం ప్రజల మధ్యనే ఉండే పెద్దాయనను గెలిపించుకోవాల్సిన బాధ్యతప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తానుసైతం ఈనియోజకవర్గలో ఎవరికీ సీటుఇవ్వకుండా వనమా అయితేనే బాగుంటుందన్న అభిప్రాయం, తాపత్రయంతో తిరిగి వనమాను ఎన్నికల బరిలో దింపానన్నారు. ఈఎన్నికల్లో వనమాను గెలిపించిన వెంటనే ఐదారుసార్లు కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించి స్వయంగా దగ్గరుండి నియోజకవర్గాన్నిఅన్ని విధాలా అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా సీతారామప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయించి తిరిగి త్వరలో ప్రారంభోత్సవం చేస్తానన్నారు. మూడోసారి బీఆర్‌ఎస్‌పార్టీ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాను బంగారు తునకలా తయారు చేసుకుందామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలన్నారు.ప్రత్యేక తెలంగాణరాష్ట్ర ఉద్యమ సమయంలో అందర్ని ఏకతాటిపైకి తెచ్చి సమైఖ్యాంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను ఎలా విడిపించుకున్నామో అంచలంచెలుగా రాష్ట్రాన్ని ఆతరహాలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చుకుంటున్నామని అన్నారు.ఆంధ్రా పాలకుల పిడికిలిలో చిక్కుకున్న తెలంగాణలో తెలంగాణ బిడ్డలు అడుగడుగునా దగాకు గురయ్యారని, తెలంగాణ వచ్చాక ఎక్కడైనా ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలిపిన దాఖలాలు ఉన్నాయాని ప్రశ్నించారు.10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, అడుగడుగునా ప్రతి జిల్లాకు మెడికల్‌ కళాశాలతోపాటు సుందరమైన కలెక్టరేట్‌ భవనాలు, పాలనకు ఏదీ అడ్డుతలగొద్దన్న ధృడ సంకల్పంతో అనేక సంస్కరణలను చేయడం జరిగిందన్నారు. రైతు బంధు, కళ్యాణలక్ష్మీ, దళితబంధు, బీసీ, మైనార్టీ బంధులు ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేదకుటుంబం ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామన్నారు.మాతా శిశుఆసుపత్రులను నిర్మించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రతి మహిళకు ఉచితంగా కాన్పు చేయడంతోపాటు కెసిఆర్‌ కిట్‌ను అందచేస్తూ పేదింటి పిల్లలకు ఆరి ్థక సహాయం అందిస్తున్నామన్నారు. మనరాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం, పరాయి పాలకుల చేతుల్లోకి పోకుండా కాపాడుకుందామన్నారు. రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రాపాలకుల చేతుల్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకొని ఓటు వేయాలన్నారు. పాల్వంచ పట్టణంలో కెటిపిఎస్‌ ఉన్నప్పటికీ ఆనాడు కొత్తగూడెం నియో జకవర్గంతోపాటు రాష్ట్రంలో కరెంట్‌ కష్టాలు తప్పలేదన్నారు.అటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా చూసుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. సింగరేణి సంస్థను సైతం ఆనాటి పాలకులు అప్పుల ఊబిలోకి నెట్టి ప్రయివేట్‌పరం చేసేందుకు కుట్రలు పన్నారని సింగరేణి సంస్థను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సింగరేణి కార్మికుడితోపాటు కార్మిక కుటుంబాలు, ప్రజలకు ఉందన్నారు.సంస్థ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు.సంస్థ మనుగడకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కార్మికుల కష్టార్జితం వృధాకాకుండా సింగరేణి సంస్థలో అనేక సంస్కరణలను చేయడం జరిగిందన్నారు.లాభాల్లో వాటాను పెంచి ఇచ్చిన ఘనత ఒక్క బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. యాచించే స్థాయినుండి శాసించే స్థాయికి సింగరేణి కార్మికులతోపాటు సింగరేణి యాజమాన్యాన్ని అభివృద్ధి చేశామన్నారు. అనంతరం ఖమ్మం సభకు తరలివెళ్లిన కెసిఆర్‌ అక్కడ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న ఒక నాయకుడిని తీసుకొచ్చి మంత్రిని చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచి,ద్రోహం చేసి మరోపార్టీల చేరిన ఆయనను చిత్తుగా ఓడిరచాలన్నారు.మరో నాయకుడు ఉమ్మడి ఖమ్బమం జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్లీ గేటును తొక్కనివ్వననడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. ఖమ్మం జిల్లా పోరాటాలకు ,చైతన్యానికి నెలవని, అటువంటి చైతన్యవంతమైన గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాతారని ఆశీస్తున్నానని అనా ్నరు. అదే విధంగా భారతదేశంలో రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల యుగమే రాబోతుందన్నారు. ఖమ్మం నియోజకవర్గాన్ని మున్సిపల్‌ కార్పోరేషన్‌తోపాటు రఘునాథపాలెం మండలాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నానన్నారు.రెండు సభల్లో సిఎం కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్‌కు కారుగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తుమ్మ ముల్లు కావాలో లేక పువ్వాడ పువ్వు కావాలో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశాల్లో ఎంపి నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బండి పార్థసారధి, రేగా కాంతారావు, హరిప్రియ,మెచ్చానాగేశ్వరరావు, రాములునాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, తెల్లంవెంకట్రావ్‌, ఉపేందర్‌రెడ్డి,బానోతు మధన్‌లాల్‌, లింగాల కమల్‌రాజ్‌, టీబీజీకెఎస్‌నాయకులు వెంకట్రావ్‌, రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, కోనేరు సత్యనారాయణ(చిన్ని), డిసీసీబి ఛైర్మన్‌ కూరాకుల నాగభూషణం, జెడ్పీవైస్‌ఛైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, ఖమ్మం కార్పోరేషన్‌ ఛైర్మన్‌ నిరజ, మున్సిపల్‌ఛైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు