Sunday, September 8, 2024
spot_img

కీలక బాధ్యతల్లో క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్..

తప్పక చదవండి
  • ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా నియామకం..
  • ప్రస్తుతం బెంగుళూరు నేషనల్ క్రికెట్ అకాడెమీ చీఫ్ గా ఉన్న లక్ష్మణ్..
  • ఆసియా క్రీడలు జరిగే చైనాకు వెళ్లనున్న వైనం..

సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా క్రీడల్లో ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఆసియా క్రీడలకు బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్న లక్ష్మణ్ టీమిండియాతోపాటు ఆసియా క్రీడలు జరిగే చైనాకు వెళ్లనున్నాడు. లక్ష్మణ్‌తోపాటు సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి కూడా కోచింగ్ యూనిట్‌లో ఉండనున్నారు. సాయిరాజ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. మునీష్ బాలి ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కాగా టీమిండియాకు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు లక్ష్మణే టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా భారత అండర్ 19 జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే 2021 ప్రపంచకప్‌ను భారత యువ జట్టు గెలిచింది. అదే సమయంలో ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టుకు కూడా తాత్కాలిక హెడ్ కోచ్‌గా హృషికేశ్ కనిట్కర్ వ్యవహరించనున్నాడు. రజిబ్ దత్తా బౌలింగ్ కోచ్‌గా.. శుభదీప్ ఘోష్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు