Sunday, September 8, 2024
spot_img

కాంగ్రెస్‌ పార్టీ తుప్పు పట్టిన ఇనుము

తప్పక చదవండి
  • వర్షంలో పెడితే పూర్తిగా నాశనమే!
  • మధ్యప్రదేశ్‌ను పేద రాష్ట్రంగా మార్చింది
  • కాంగ్రెస్‌ హయాంలో చాలా రంగాల్లో వెనకబాటు
  • మధ్యప్రదేశ్‌ కార్యకర్తల మహాకుంభ్‌లో మోడీ

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లో చాలా కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని బిమారు(పేద) రాష్ట్రంగా మార్చిందని ప్రధాని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తుప్పు పట్టిన ఇనుము లాంటిదని.. వర్షంలో పెడితే పూర్తి నాశనమైపోతుందని ఎద్దేవా చేశారు. సమర్థులైన యువత, వనరులు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్‌ చాలా రంగాల్లో వెనకబాటుకు గురిచేసిందని దుయ్యబట్టారు. భోపాల్‌లోని జంబోరీ మైదానంలో సోమవారం ‘కార్యకర్తల మహాకుంభ్‌’లో పాల్గొన్న మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకుందని మోడీ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న యువత తమ జీవితంలో బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రమే చూశారన్నారు. ప్రస్తుత యువత కాంగ్రెస్‌ ప్రభుత్వ దుష్పరిపాలన చూడకపోవడమే అదృష్టమని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో మధ్యప్రదేశ్‌ను కొత్త శక్తితో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యత్నించిందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తుప్పు పట్టిన ఇనుము లాంటిదని.. వర్షంలో 7 పెడితే పూర్తి నాశనమైపోతుందని ఎద్దేవా చేశారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. కానీ సమర్థ యువత కలిగిన, వనరులు కలిగిన మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్‌ బిమారు (చాలా రంగాల్లో వెనకబాటు) అయ్యేలా చేసింది. కానీ బీజేపీ అధికారంలో ఉన్న కాలంలో మధ్యప్రదేశ్‌ను కొత్త శక్తితో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు యత్నించింది. కాంగ్రెస్‌ అంటేనే చెడు పాలన. కోట్లాది రూపాయల అవినీతితో అనేక రాష్ట్రాలను నాశనం చేసింది. దేశంలో కొన్నేళ్లపాటు అవినీతి, పేదరికం, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించిందని అన్నారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం దేశ ప్రజలను పేదలుగానే కాంగ్రెస్‌ ఉంచేసిందని మోడీ ఆరోపించారు. తమ ఐదేళ్ల పాలను 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్లు చెప్పారు. డిజిటల్‌ చెల్లింపులను కాంగ్రెస్‌ వ్యతిరేకించిందన్న మోడీ.. యూపీఐ మోడ్‌కు ప్రపంచం ఆకర్షితులైందని చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ సహా విపక్షాలు బలవంతంగా మద్దతు ఇచ్చాయని తెలిపారు. బిల్లును వారు అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయారని.. ఎందుకంటే మహిళలు ప్రస్తుతం పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ నాయకులకు పేద ప్రజల జీవితం.. పిక్నిక్‌ లాంటిదని మోడీ ఎద్దేవా చేశారు. పేదవాడి వ్యవసాయ క్షేత్రం.. ఆ పార్టీ నేతలకు ఫొటో షూట్‌ కోసం వాడే ప్రదేశమంటూ రాహుల్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. దేశం వివిధ రంగాల్లో విజయం సాధించడం కాంగ్రెస్‌ నేతలకు ఇష్టం లేదని ఆరోపించారు. భారత్‌ను తిరిగి 20వ శతాబ్దానికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్‌ చూస్తోందని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు