Sunday, September 8, 2024
spot_img

దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్న కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

తప్పక చదవండి

ఎఐసిసి మరియు టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు

- Advertisement -

ఈరోజు కొమ్మూరి క్యాంపు కార్యాలయం నుండి జనగామ చౌరస్తా వరకు బైక్ లతో ర్యాలీగా వెళ్లి బి.ఆర్.స్ పార్టీ మోసాలకు నిరసనగా సిఎం కె.సి.ఆర్ పదితలలతో ఉన్న దిష్టిబొమ్మను దగ్నం చేసి RDO కార్యాలయంలో అండాలు మేడం గారినీ బి.ఆర్.ఎస్ ప్రభుత్యం ప్రజలకు చేస్తున్న మోసాల మీద వినతి పత్రం అందచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

అనంతరం జనగామ జిల్లా నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి PACS డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి సేవదల్ రాష్ట్ర కోఆర్డినేటర్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి లీగల్ సెల్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలేటి సిద్దిరాములు మాట్లాడుతూ

ప్రజా ధనాన్ని వృధా చేస్తూ, తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తవకముందే, ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఏర్పడ్డ తొమ్మిదేళ్లకే బిఆర్ఎస్ పార్టీ తన రాజకీయ లబ్దికోసం దశాబ్ది ఉత్సవాలంటూ ఆర్భాటంగా పలు కార్యక్రమాలు చేపట్టింది, ఈ తొమ్మిది పాలన లో తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ ఓరగబెట్టిందేమీ లేదు.
తమ 9 ఏళ్ల పాలనలో ప్రజలను బిఆర్ఎస్ దగా చేసింది, బిఆర్ఎస్ దగా పాలనను ప్రజలకు తెలిసేలా దశాబ్ది దగా పేరుతో

బిఆర్ఎస్ ప్రభుత్వ మోసాలు.

  1. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య.
    2.ఫీజ్ రీయంబర్స్ మెంట్.
    3.ఇంటికో ఉద్యోగం.
  2. నిరుద్యోగ భృతి.
    5.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.
    6.దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి.
    7.పోడు భూములకు పట్టాలు.
  3. రైతు రుణ మాఫీ.
  4. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు.
  5. 12 శాతం గిరిజన రిజర్వేషన్లు.

బిఆర్ఎస్ దగా పేరుతో ఇచ్చిన హామీలు తప్పిన బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను దిష్టిబొమ్మ రూపంలో తయారు చేసి, ఆ దిష్టిబొమ్మకు పది తలలు ఏర్పాటు చేసి, ప్రతి తలకు ప్రభుత్వ వైఫల్యాలను రాసి, ఆ దిష్టిబొమ్మను ర్యాలీగా ప్రదర్శన తీసి, కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దహన చేయడం జరిగింది తెలిపారు

ఈ కార్యక్రమంలో పట్టురీ శ్రీనివాస్,SC సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ చేన్నోజు విజయ లక్ష్మి, పిట్టల సతీష్,బండారు శ్రీనివాస్,జాయ మల్లేష్,ST సెల్ జనగామ పట్టణ అధ్యక్షులు కోటా నాయక్,అర్షద్ రహమాన్,
యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి క్రాంతి, యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా నాయకులు గందమల్ల కమలాకర్,పిడుగు రమేష్ , సభావత్ శ్రీను,
మునిబేగం,కర్రె ఉదయ్, బిర్రు సత్యనారాయణ, మోటే మల్లేష్,తాటి కనుక స్వామి, యండి ఇస్మాయిల్, కొమ్మూరి యువసేన జనగామ మండల అధ్యక్షలు బక్క ప్రవర్దన్, ఉపాధ్యక్షులు గాజుల రాజు , బైరగొని రఘు గౌడ్ , సుంకరి శేఖర్,డానియల్, వల్లాల బానుచందర్, మచ్చుపహాడ్ గ్రామ నాయకులు రాజు, ఐలయ్య, బల్బీర్ సింగ్, ఇంద్రసింగ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు