Sunday, September 8, 2024
spot_img

వరుస సమీక్షలతో సీఎం రేవంత్‌ బిజీ

తప్పక చదవండి
  • ఉద్యోగ ఖాళీలు.. భర్తీలపై ఆరా
  • పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు
  • రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వరుస సమీక్షలతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ప్రధానంగా ఆయన సోమవారం వ్యవసాయం,నిరుద్యోగ రంగాలపై దృష్టి సారించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ సవిూక్షించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను ఒకటొకటిగా నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి
రేవంత్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీల భర్తీ చేపడతామని మేనిఫెస్టోలో ప్రకటించడమే కాకుండా, ఏయే రోజున ఏయే నోటిఫికేషన్లు విడుదల అవుతాయో వివరంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఎన్ని ఉన్నాయో తెలపాలని టిఎస్‌ పిఎస్‌ సి చైర్మన్‌ జనార్దనరెడ్డిని సిఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్ని ఖాళీలు భర్తీ అయ్యాయో కూడా తెలపాలన్నారు. ఉద్యోగాల భర్తీపై రెండు రోజుల్లో సవిూక్ష నిర్వహిస్తామనీ, దీనికి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆయన టీఎస్‌ పిఎస్‌ సి చైర్మన్‌ ను ఆదేశించారు. రైతు భరోసా పథకంపై కూడా సీఎం సవిూక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, అధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులతో.. ఏక్సైజ్‌ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎక్సైజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సంబంధిత అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి రైతు భరోసా పథకంపై చర్చించారు. ఈ సవిూక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్‌ బాబు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఖాతాల్లో ఏడాదికి ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు రూ.500 బోనస్‌ ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల విడుదలపై సీఎం రేవంత్‌ రెడ్డి సీవిూక్షించారు. అయితే, ప్రభుత్వ ఖజానాలో మాత్రం నిధులు లేనట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ చివరి వారంలో యాసంగికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఎలాగైన నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్‌ భావిస్తున్నట

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు