Sunday, September 8, 2024
spot_img

బాలల దినోత్సవాన్ని మరిచిన బాలభవన్.!

తప్పక చదవండి
  • బాలల దినోత్సవాన్ని పట్టించుకోని వైనం..
  • కనీసం నెహ్రూపటానికి దండకూడా వేయని దుస్థితి.!
  • నెలసరి జీతాలపై ఉన్న సోయి.. జాతీయ బాలల దినోత్సవంపై లేదు
  • ఒకప్పటి కళానిలయం నేడు వెలవెల బోతోంది..

హైదరాబాద్ : భారత దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. బాలల దినోత్సవం పిల్లల హక్కులు, సంరక్షణ మరియు విద్యా, వారి మనోవికాసాన్ని పెంచడానికి భారతదేశం అంతటా గుర్తించబడింది. పిల్లలు చాచా నెహ్రూ అని పిలవబడే అతను పిల్లలకు విద్యతో పాటు వివేకాన్ని, మానసిక వికాసాన్ని వారిలో నింపాలని సూచించాడు. నెహ్రూ పిల్లలను దేశం యొక్క నిజమైన శక్తిగా మరియు సమాజానికి పునాదిగా భావించారు.

దేశం మొత్తం సాధారణంగా బాలల దినోత్సవం భారతదేశం అంతటా నిర్వహించే విద్యాపరమైన మరియు ప్రేరణాత్మక కార్యక్రమాలతో పిల్లల కోసం జరుపుకుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాల భవన్ కేంద్ర కార్యాలయంలో కనీసం నెహ్రూ పటానికి సైతం దండ వేసిన నాధుడు లేడు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోపల ఉన్న ఈ బాల భవన్ లో పదుల సంఖ్యలో ఇక్కడ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. నెలకు వేలాది రూపాయల జీతాలు పొందే వీరికి కనీసం ఈరోజుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలియకపోవడం సిగ్గుచేటు.

- Advertisement -

ఒకప్పుడు నవంబర్ 14 వ తేదీన బాలల దినోత్సవం హైదరాబాద్ మొత్తం దద్దరిల్లే విధంగా బాలల సాంస్కృతిక కార్యక్రమాలు పబ్లిక్ గార్డెన్ లో ప్రతిధ్వనించేలా జరుపుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలను పట్టించుకునే వారే కరువయ్యారు. తెలంగాణ కలలకు, సాంస్కృతిక ఉద్యమానికి పెట్టింది పేరు. మరి ఇలాంటి రాష్ట్రంలో బాలల దినోత్సవాన్ని మరవడం శోచనీయం, క్షమించరాని నేరం. ఇక ఈ బాల భవన్ లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులంతా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్లు డిప్యూటేషన్ పై ఇక్కడ విధులు నిర్వహించడం, సొంత డిపార్ట్మెంట్ వారు ఇందులో లేకపోవడం, అవగాహన రాహిత్యం వలన జాతీయ బాలల దినోత్సవం జరుపుకోకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. బాల భవన్ లో నిర్లక్ష్యం ఇంత విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని దీన్నిబట్టి తెలుస్తోంది. వీరి వలన బాలల కళానిలయం వెలవెలబోతోంది.

వివరణ కోసమని సంబంధిత బాల భవన్ డైరెక్టర్ రమణ కుమార్ ను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయగా, ఆయన ఫోన్ ఎత్తి, సదరు వివరణ ఇవ్వకుండానే బాల భవన్ పేరు చెప్పగానే ఫోన్ కట్ చేయడం గమనార్హం. ఇది ఇక్కడి అధికారుల పనితీరు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు