Sunday, September 8, 2024
spot_img

చెక్‌ పోస్టుల్లో తనిఖీ పకడ్బందీగా చేయాలి

తప్పక చదవండి
  • బృందాల తనిఖీల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి.
  • అబర్కీ శాఖ ద్వారా రూ. 3 కోట్ల 40 లక్షల 665 వేల అక్రమ మద్యం సీజ్‌..
  • ఎం.సి.సి ని పకడ్బందీగా అమలు చేయాలి.
  • కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌ వెంకట్రావు.

సూర్యాపేట : జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన అన్ని చెక్‌ పోస్ట్‌ లలో మంరింత నిఘా పెంచామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ సంబంధిత కమిటీలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ లోని మీటింగ్‌ హాల్‌ నందు ఏర్పాటు చేసిన జిల్లా ఇంటెలిజెన్స్‌ కమిటీ సమావేశం లో ఎస్పీ రాహుల్‌ హెగ్డే తో కలసి కలెక్టర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేయడం జరుగుతుందని సంబంధిత బృందాలు నిఘా మరింత పెంచాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో ఉన్న బ్యాంక్‌ లలో జరిగే లావాదేవీలు అలాగే డిజిటల్‌ లావాదేవీలపై గట్టి నిఘా ఉంచి లావాదేవీల రోజువారి వివరాలు అందించాలని సూచించారు.గృహోపకరణాలు, వస్త్ర దుకాణాల గోదాములల్లో తనిఖీలు ఎక్కువ చేస్తూ స్టాక్‌ ను పరిశీలించాలని సూచించారు.ఎఫ్‌ ఎస్‌ టి, ఎస్‌ ఎస్‌ టి టీములు నిఘా ఉదృతం చేయాలన్నారు.చెక్పోస్టుల వద్ద తనిఖీలు స్వాధీనం చేసుకున్న వాటికి తప్పకుండా రసీదు అందజేయాలని కలెక్టర్‌ తెలిపారు.వాహనాల తనిఖీలలో భాగంగా ఇప్పటివరకు గ్రీవెన్సు కమిటీ వద్ద 162 కేసులకు సంబంధించి ఉన్న నిల్వ నగదు, ఇతర వస్తువుల విలువ రూ. 4,55, 48, 786/- లలో ఫై. డి.జి.సి ద్వారా విడుదల చేసిన 127 కేసులలో నగదు రూ 1,99,24,420,బంగారం , వెండి, 3 కేసులకు సంబంధించి వస్తువుల విలువ రూ.27,56,200, ఇతర వస్తువుల 17 కేసులలో నగదు విలువ రూ. 88,71,858,మొత్తం 147 కేసులలలో విడుదల రూ. 3,15,52,478 అదేవిదంగా ఐ. టి శాఖకు రిఫర్‌ చేసిన 3 కేసుల నగదు విలువ 1,21,95,226 అలాగే డి.జి.సి పెండిరగ్‌ 3 కేసు నగదు విలువ రూ. 5,49,732 కలవని అలాగే 9 కేసులకు సంబంధిత వారు అప్పీళ్లు చేసుకోనందున బంగారం, వెండి, నగదు ఇతర వస్తువులకు సంభందించి రూ. 12, 51,350 డి.జి.సి ఆధీనంలో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు.అలాగే ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఇప్పటివరకు 568 కేసులు నమోదు చేశామని, 282 మందిని అరెస్ట్‌ చేశామని అక్రమ మద్యం 52,425 లీటర్ల మద్యం పట్టుకున్నామని దాని విలువ రూ. 3, 40, 46, 665 ఉంటుందని అలాగే 33 వాహనాలు సీజ్‌ చేశామని తెలిపారు.30 వాహనాలు స్వాధీనం జిల్లాలో ఉన్న అన్ని మద్యం దుకాణాలు, బేల్టు షాపుల తనిఖీల్లో ఎక్కువ కేసులు నమోదు చేయాలని సూచించారు.సి విజిల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం అవ్వాలని సూచించారు.మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పకడ్బందీగా అమలు చేయాలని రెవెన్యూ పోలీస్‌ ఎక్సైజ్‌ శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ అనిత,ఆర్‌.ఎం. ఎస్‌.బి.ఐ జ్యోతి, డి ఎఫ్‌ ఓ సతీష్‌ కుమార్‌, ఎల్‌.డి.ఎం.బాపూజీ, సిటిఓ యాదగిరి, డిసిఓ శ్రీధర్‌,ఎఓ సుదర్శన్‌ రెడ్డి ఎలక్షన్‌ సూపర్డెంట్‌ శ్రీనివాసరాజు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు