Sunday, September 8, 2024
spot_img

కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ మార్కెట్ లోకి వచ్చేసింది..

తప్పక చదవండి

జెన్‌ మొబిలిటీ కంపెనీ జెన్‌ మైక్రో పాడ్‌ పేరుతో కార్గో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ను లాంచ్‌ చేసింది. గురుగ్రామ్‌కు చెందిన ఈవీ స్టార్టప్‌ కంపెనీ అయిన జెన్‌ మొబిలిటీ ఈ వాహనాన్ని అనేక రెంటల్‌, లీజింగ్‌ సంస్థలతోపాటు థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్‌ ప్రొవైడర్లతో కలిసి రూపొందించింది. లీజు రకాన్ని బట్టి వారికి వాహనాన్ని నెలకు రూ.9,999 అద్దెపై అందించనున్నది.

వాహనం ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి :
ఈ వాహనం ఆర్‌5ఎక్స్‌, ఆర్‌10ఎక్స్‌ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.. ఇది 150 కిలోగ్రాముల వరకు బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకటిన్నర నుంచి రెండు గంటల మధ్య పూర్తిగా చార్జ్‌ అవుతుంది. కేవలం నాలుగు యూనిట్ల కరెంటును మాత్రమే వినియోగించుకొంటుంది. సింగిల్‌ చార్జ్‌తో 120 కిలోమీటర్ల వరకూ ప్రయాణించొచ్చు. ప్రత్యేకమైన కార్గోబాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో షెల్ఫ్‌లు, రిఫ్రిజిరేటర్‌ బాక్స్‌లు, ఓపెన్‌ టబ్‌లు ఉంటాయి. దీన్ని అవసరానికి తగ్గట్టు కస్టమైజ్‌ చేయించుకోవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు