Sunday, September 8, 2024
spot_img

కెనడా ఆరోపణల ప్రభావం భారత్‌-యూకే సంబంధాలపై ఉండదు : బ్రిటన్‌

తప్పక చదవండి

లండన్‌ : కెనడాలో ఏర్పాటువాద హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే నిజ్జార్‌ హత్యలో భారత్‌ పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో ఆరోపించారు. ఇందులో ఇద్దరు భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత భారత గూఢచార సంస్థ ‘రా’ అధికారిని బహిస్తున్నట్లు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. మరో వైపు కెనడా తీరుపై భారత్‌ సైతం ధీటుగానే స్పందించింది. కెనడా సీనియర్‌ దౌత్యవేత్తను భారత్‌ బహిష్కరించింది. ఐదురోజుల్లోగా భారత్‌ విడిచి వెళ్లాలంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌ ప్రతినిధి భారత్‌తో సంబంధాలపై స్పందించారు. కెనడా చేసిన ఆరోపణలతో ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న వాణిజ్య చర్చలపై ప్రభావం చూపబోని డౌనింగ్‌ స్టీట్ర్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కెనడా అధికారులతో బ్రిటన్‌ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. భారత్‌తోనూ వాణిజ్య చర్చలు గతంలోనే మాదిరిగానే కొనసాగుతుందన్నారు. ల్యాండ్‌మార్క్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ దిశగా వేగంగా పని చేయడం కొనసాగించాలని ఇరుదేశాలు అంగీకరించాయన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు