Sunday, September 8, 2024
spot_img

భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో సంచలన ఆరోపణలు

తప్పక చదవండి

ఒట్టావా: ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్‌ పాత్ర ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రుడో ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ను చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉందని, తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయమై దేశీయ భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని మంగళవారం వెల్లడిరచారు. కెనడా పౌరుడి హత్యలో ఏదైనా విదేశీ ప్రభుత్వ ప్రమేయం తమ సార్వభౌమాధికారానికి ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అంటూ ప్రకటించారు. ఈ విషయమై సహకరించాల్సిందిగా భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. గతవారం జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు ట్రుడో తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 18న వాంకోవర్‌లోని సర్రే గురుద్వారా వద్ద భారత్‌ వాంటెడ్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు