Sunday, September 8, 2024
spot_img

ఈనెల చివరిలోగా ఖరీఫ్‌ 2022-23సీ.ఎం.ఆర్‌. లక్ష్యాన్ని పూర్తి చేయాలి

తప్పక చదవండి
  • జిల్లా కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే

యాదాద్రి భువనగిరి (ఆదాబ్‌ హైదరాబాద్‌): గురువారం నాడు ఆయన కాన్ఫరెన్స్‌ హాలులో రైస్‌ మిల్లుల యజమా నులతో సమావేశమై గత ఖరీఫ్‌ 2022-23 కష్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పనులకు సంబంధించి లక్ష్యాలు పూర్తి కాని మిల్లర్లను సమీక్షిస్తూ జిల్లాలో 44 మిల్లుల ద్వారా ఒక లక్ష 91 వేల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి 1 లక్షా 65 వేల మెట్రిక్‌ టన్ను లు సిఎంఆర్‌ పూర్తి కావడం జరిగిందని, 84 శాతం లక్ష్యం సాధించడం జరిగిందని, ఈనెల చివరి లోగా వంద శాతం లక్ష్యాన్ని సాధించా లని మిల్లర్లను ఆదే శించారు. ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడుతూ.. ఒక వారం లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులకు, మిల్లర్లకు సూచించారు. ఇప్పటివరకు 2 లక్షల 44 వేల మెట్రిక్‌ టన్ను ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 20 వేల 800 మంది రైతుల ఖాతా లలో 430 కోట్లు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ ఏ.భాస్కర రావు, సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ గోపికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివా సరెడ్డి, జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ కోశాధికారి వెంకటేష్‌, మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు